జీవిత భాగస్వాములైన జంటలు ఎంత తరుచుగా శృంగారంలో పాల్గొనాలి అనే అంశం మీద సైంటిస్టులు ఓ అధ్యయనం చేశారు. ఎక్కువ సార్లు కలయికలో పాల్గొనేవారికంటే.. అలా చేయనివారే సంతోషంగా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది.
undefined
భార్యభర్తలు ఎంత ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే వారి జీవితం అంత హ్యాపీగా ఉంటుందని గత పరిశోధనలు తేల్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదా? అంటే ఉంది.. కాకపోతే కొన్ని మినహాయింపులు అంటున్నారు పరిశోధకులు. దీనిమీద వారు నెంబర్లతో డాక్యుమెంట్ కూడా తయారుచేశారు.
undefined
ఇదే విషయంపై విదేశాలలో పలువురు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేపట్టారు. ఇందులో వారికి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 2017లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. ఒక జంట సాధారణంగా సగటున సంవత్సరానికి 54 సార్లు మాత్రమే సంభోగ క్రియలో పాల్గొంటుందంట. అంటే వారానికి ఒక రోజు మాత్రమే.
undefined
2015లో సోషల్ సైకొలాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం... వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే జంటలు. తరుచూ సెక్స్ చేసుకునే వారికంటే ఎక్కువ సంతోషంగా ఉంటాయట.
undefined
వీరి డాక్యుమెంటరీ ప్రకారం 30 ఏళ్ల లోపు వారు సంవత్సరానికి 112 సార్లు అంటే వారానికి రెండుసార్లు సెక్స్ చేస్తారట. 30-39 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు సంవత్సరానికి 86 సార్లు శృంగారంలో పాల్గొంటారు.
undefined
40-49యేళ్ల వయసున్న వాళ్లు ఏడాదికి 69 సార్లు మాత్రమే కలుసుకోగా.. అంతకంటే ఎక్కువ వయసున్న జంటలు యేడాదికి 52 సార్లు శృంగారంలో పాల్గొంటారని ఈ అధ్యయనం సూచించింది.
undefined
దీనికి కారణమేంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ శృంగారపరమైన కోరికలపై ఆసక్తి తగ్గడమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇది కొంత ఆందోళన కలిగించేదే అయినా వాస్తవమిదే అంటున్నారు.
undefined
యవ్వనంలో ఉన్నప్పుడు ఏర్పడే చెడు అలవాట్లు.. అంటే సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఎక్కువమంది అమ్మాయిలతో తిరగడం లాంటివి కూడా వయసు పై బడుతున్న కొద్దీ తమ ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు.
undefined
ఆరోగ్యవంతమైన శృంగార జీవితం దీర్ఘకాలం ఉండాలంటే.. జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి. దురలవాట్లనుండి దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకుంటూ.. తరుచూ వ్యాయామం చేయాలని.. అలా అయితేనే సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయొచ్చని వారంటున్నారు.
undefined
ఇక దీంతోపాటు తరుచూ సెక్స్ లో పాల్గొంటేనే శృంగార జీవితం రసమయభరితమవుతుందనేది అపోహ మాత్రమేనని తేల్చేశారు. కాకపోతే జీవిత భాగస్వామితో కలిసిన ప్రతీసారి ఇద్దరూ భావప్రాప్తి పొందారా? ఆప్యాయంగా సంభాషించుకున్నారా అనేదే ముఖ్యమని అంటున్నారు.
undefined
శృంగారం అంటే ఇద్దరు వ్యక్తుల శారీరక, మానసిక పరమైన ఉల్లాసవంతమైన చర్య అని, దీనివల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని అంటున్నారు. అంతేకానీ ఒక్కరి అవసరాలు తీర్చేది కాదని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు.
undefined