శృంగారం తర్వాత పురుషులు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవి.. !

First Published | Sep 28, 2023, 3:38 PM IST

శృంగారం దంపతులిద్దరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా సెక్స్ లో పాల్గొనే దంపతులకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అయితే సెక్స్ తర్వాత పురుషులు తమ భాగస్వామితో కలిసి కొన్ని పనులు చేస్తే వీరి ఆనందం రెట్టింపు అవుతుందట. 
 

సాధారణం శృంగారంలో పాల్గొన్న పురుషులు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఎందుకంటే శరీరం అలసిపోతుంది కాబట్టి. కానీ ఆడవారికి అలా కాదు. వీరికి సెక్స్ తర్వాత నిద్రపట్టదు. వీళ్లను ఇలా వదిలేసి పరుషులు నిద్రపోవడం వల్ల ఆడవారికి అస్సలు నచ్చదట. అందుకే సెక్స్ తర్వాత పురుషులు మహిళలను ఆకట్టుకోవడానికి కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ఈ పనులు ఆడవారికి మీ పట్ల ప్రేమను మరింత పెంచుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాటలు వినడం

సెక్స్ తర్వాత దంపతులు మంచి మూడ్ లో ఉంటారు. మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో మంచి పాటలు వింటే మీ ఆనందం పెరుగుతుంది. మీ మూడ్ ఇంకా బాగుంటుంది. నిపుణుల ప్రకారం.. మీకు నచ్చే పాటలను వినడం వల్ల మీ మూడ్ పెరుగుతుంది. ఇది మీ ఇద్దరినీ మానసికంగా సంతోషపెడుతుంది. అందుకే సెక్స్ తర్వాత పాటలను వింటే మీ శరీరం, మనస్సు రెండూ అలసిపోకుండా ఉంటాయి. అలాగే ఒకరికొకరు బాగా ఆకర్షితులవుతారు. 


Sex Related Injuries

మసాజ్

సెక్స్ తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో మసాజ్ కూడా ఒక ముఖ్యమైన పనే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సెక్స్ కూడా ఒక వ్యాయామే. దీనివల్ల కూడా ఒంటినొప్పులు కలుగుతాయి. అందుకే సెక్స్ తర్వాత మసాజ్ చేస్తే వారికి మంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే పురుషులు ఖచ్చితంగా ఈ పని చేయాలి. 

అభినందించడం

మీరు గమనించారో? లేదో? మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అభినందిస్తే ఎంతో సంతోషిస్తారు. అభినందనలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది శృంగారానికి కూడా ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే శృంగారంలో పాల్గొన్న తర్వాత మీ భార్యను అభినందించడం మర్చిపోకండి. ఆ తర్వాత మీ భార్యలో ఎంతో మార్పును చూస్తారు.
 

దుస్తులను సర్దుబాటు చేయడం

ఇది కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పనే. సెక్స్ తర్వాత మీ భాగస్వామి దుస్తులను సర్దుబాటు చేయడానికి వారికి సహాయపడండి. ఇది మిమ్మల్ని వారి మనస్సులో గొప్ప స్థానంలో ఉంచుతుంది. దీనికోసం మీరు ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 
 

మాట్లాడటం

చాలా మంది సెక్స్ తర్వాత ఎవరి దారిన వెళతారు. కానీ ఇది మంచిది కాదు. సెక్స్ తర్వాత మీరు ఖచ్చితంగా భాగస్వామితో మాట్లాడాల్సిందేనంటున్నారు నిపుణులు. కానీ చాలా మంది పురుషులు తమ పని అయిపోయిందని సెక్స్ వారితో మాట్లాడటం మానేస్తారు. కానీ అలా అస్సలు చేయకండి. సెక్స్ తర్వాత వారితో కాసేపు మాట్లాడండి. మనసు విప్పి మాట్లాడండి. వారి కోరికలను తెలుసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Latest Videos

click me!