స్క్రీన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల కంటిపై ఫోన్ వెలుతురు పడి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. గంటలకు గంటలు స్క్రీన్ ను చూడటం వల్ల కంటిలో చికాకు, మంట, దురద పెట్టడం, కళ్లు మసక బారడం , కళ్లు బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ అలవాటు ఎక్కువ రోజులు కొనసాగితే.. సైట్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫోన్ ను ఎక్కువ సేపు చూసే అలవాటును మానుకోవాలి. అలాగే మీ రోజు వారి ఆహారంలో కొన్నింటినీ తప్పకుండా చేర్చుకోవాలి. ఇవి మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..