కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఇది ఎందుకొస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

First Published Nov 29, 2022, 4:05 PM IST

గంటల తరబడి కంప్యూటర్ల ముందు లేదా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. 
 

మన శరీరంలో కళ్లు అత్యంత ముఖ్యమైన, మృదువైన భాగం. అందుకే కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుమ్ము, ధూళి, కాలుష్యంతో పాటు, కంప్యూటర్ స్క్రీన్లు, ట్యాబ్ లు, మొబైల్ ఫోన్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల కళ్లు బలహీనపడతాయి. వీటివల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్య బారిన పడే అవకాశం ఉంది. అసలు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వస్తుంది. దీనిని సాధారణంగా డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సుమారుగా 60 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మన కళ్లపై ఎక్కువ సేపు ఒత్తిడి పెరిగితే.. కంటి సమస్యలు వస్తాయి. ఈ కంటి సమస్యలు ఒక్క పెద్దవారిలోనే కాదు.. ఎక్కువ సేపు ట్యాబ్ లు లేదా కంప్యూటర్లు చూస్తూ ఉండే పిల్లలకు కూడా ఈ సమస్యలు రావొచ్చు.

కంప్యూటర్లు కళ్ళను ఎలా ప్రభావితం చేస్తాయి?

మీరు ఎప్పుడూ కంప్యూటర్లు లేదా ఇతర ఎలక్ట్రానికి గాడ్జెట్లను చూస్తున్నప్పుడు.. మీ కళ్లు ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్ నే చూస్తాయి. అందులోనూ కంప్యూటర్ లో వర్క్ చేస్తునప్పుడు లేదా చదువుతున్నప్పుడు వెనకకు, ముందుకు స్క్రోల్ చేసి చూడాల్సి ఉంటుంది. దీనివల్ల కంటి కండరాలపై ఎక్కువ పనిబారం పడుతుంది. 

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కొన్ని సాధారణ కారణాలు

రోజూ కంప్యూటర్ లో లేదా ట్యాబ్ లో చదవడం లేదా కంప్యూటర్ అద్దాలను ఉపయోగించకపోవడం

వయస్సు పెరగడం

చాలా తక్కువ కాంతిలో చదవడం, రాయడం 

డిజిటల్ స్క్రీన్ పై లైట్ ఎక్కువగా ఉండటం

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లక్షణాలు: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో సంబంధం ఉన్న సాధారణ సంకేతాలు,  లక్షణాలు

చూపు మసకబారడం లేదా ద్వంద్వ దృష్టి

కళ్ల అలసట

దృష్టి మసకబారడం

కళ్ళలో మండుతున్న అనుభూతి

పొడి, ఎర్రబడిన కళ్ళు

కళ్ల నుంచి నీరు కారడం

తలనొప్పి

వెన్ను లేదా మెడ నొప్పి

దీనిని ఎలా తగ్గించుకోవాలి

మీ కంప్యూటర్ స్క్రీన్ ప్రభావాన్ని తగ్గించడానికి మీ చుట్టూ ఉన్న లైంటింగ్ ను మార్చండి. కిటికీలోంచి వెలుతురు వస్తున్నట్టైతే కర్టెన్ తో మూసేయండి. వైద్యుడి సలహీ తీసుకుని కాంటాక్టు లెన్సులు, అద్దాలను పెట్టుకోండి. 

మీ డెస్క్ ను  మీ కంటి మట్టానికి కొంచెం దిగువన, మీ ముఖం నుంచి 20 నుంచి 28 అంగుళాల దూరంలో ఉంచండి.

20-20-20 నియమాన్ని పాటించండి.  అంటే ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూడటం ద్వారా మీ కళ్లు రిలాక్స్ అవుతాయి. 

మీ కంప్యూటర్ ఫాంట్ పరిమాణాన్ని, లైంటింగ్ ను మార్చండి. దీంతో మీరు మీ కళ్ళపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. 

మీ కళ్ళు తరచుగా పొడిగా అనిపిస్తే వాటిని లూబ్రికేట్ చేయడానికి కంటి చుక్కలను ఉపయోగించండి.

click me!