RCB vs GT: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ 148 పరుగుల లక్ష్య ఛేదనలో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడారు. జోష్ లిటిల్ 4 వికెట్లు పడగొట్టి కంగారు పెట్టిన సమయంలో దినేశ్ కార్తీక్ వచ్చి గుజరాత్ పై బెంగళూరును 4 వికెట్ల తేడాతో గెలిపించాడు.
Bangalore vs Gujarat : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 52వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ పై బెంగళూరు దండయాత్ర కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టిన ఆర్సీబీ టీమ్ జీటీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్ ను చీల్చిచెండాడారు. పవర్ ప్లే లో రికార్డు భాగస్వామ్యం సృష్టించాడు.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు అద్భుతంగా ఆడి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ తరుపున షారుక్ ఖాన్ (37 పరుగులు), డేవిడ్ మిల్లర్ (30 పరుగులు), రాహుల్ తెవాటియా (35 పరుగులు) రాణించారు. లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ (42 పరుగులు), ఫాఫ్ డు ప్లెసిస్ (64 పరుగులు) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు, అయితే డు ప్లెసిస్ ఔట్ అయిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ తడబడింది. కేవలం 25 పరుగులకే డు ప్లెసిస్-కోహ్లీ సహా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు వరుసగా పెవిలియన్ కు చేరారు.
undefined
ఈ సమయంలో ఆర్సీబీని కస్తా కంగారు పెట్టింది జీటి. కానీ, అప్పటికే విజయాన్ని చాలా దగ్గరగా తీసుకువచ్చారు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లేసిస్.చివర్లో దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. కార్తీక్ 21 పరుగులతో, స్వప్నిల్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
జాషువా-నూర్ అద్భుతమైన బౌలింగ్..
గుజరాత్ తరఫున జాషువా లిటిల్, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆర్సీబీ 25 పరుగుల వ్యవధిలో 6 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపారు. ఇందులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ ల వికెట్లు కూడా ఉన్నాయి. జాషువా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక నూర్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. అంతకు ముందు ఆర్సీబీ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేసి గుజరాత్‌ను 147 పరుగులకే కట్టడి చేశారు. ఆర్‌సీబీ తరఫున మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వషాక్ తలో 2 వికెట్లు తీశారు. కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇరు జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్వెస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.