ఇండస్ట్రీ హిట్ సినిమాలో క్యాన్సర్ పేషెంట్ గా నటన..రియల్ లైఫ్ లో అదే వ్యాధికి బలైన హీరోయిన్

First Published May 4, 2024, 10:16 PM IST

వాణిశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనురాలైన చంద్రకళ తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుంచుకోదగ్గ నటి. ఆమెకి ఎక్కువగా హీరోయిన్ పాత్రల కంటే చెల్లెలి పాత్రలే వచ్చేవి. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి స్టార్స్ కి చెల్లెలుగా అనేక చిత్రాల్లో నటించింది.

సినీ లోకంలో చాలా మంది తారల జీవితాలు విషాదాంతంగా ముగియడం చూస్తూనే ఉన్నాం. అలనాటి నటీమణుల్లో సావిత్రి లాంటి స్టార్స్ కూడా రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాణిశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనురాలైన చంద్రకళ తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుంచుకోదగ్గ నటి. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో చంద్రకళ వందలాది చిత్రాల్లో మెరిసింది. ఆమెకి ఎక్కువగా హీరోయిన్ పాత్రల కంటే చెల్లెలి పాత్రలే ఎక్కువగా వచ్చేవి. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి స్టార్స్ కి చెల్లెలుగా అనేక చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా శోభన్ బాబు, చంద్రకళ అన్నా చెల్లెళ్లుగా వచ్చిన చిత్రాలు మంచి విజయం సాధించేవి. 

ఎన్టీఆర్ కూడా ఆమె ప్రతిభని గుర్తించి అనేక చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. దర్శక నిర్మాతల్లో కూడా ఆమెపై మంచి అభిప్రాయం ఉండేదట. నిర్మాతలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ తీసుకునేదట. ఆడపడుచు అనే చిత్రంలో చంద్రకళ ఎన్టీఆర్, శోభన్ బాబుకి చెల్లెలుగా నటించింది. ఆ చిత్రంలో చంద్రకళ నటన ఎన్టీఆర్ ని ఎంతగానో ఆకట్టుకుందట. 

ఆ చిత్రం చూసి అప్పట్లో ప్రతి కుటుంబంలో చెల్లెలు అంటే ఇలాగే ఉండాలి అని పోల్చుకునేవారట. అంతలా ఆమె నటన ప్రేక్షకులపై ప్రభావం చూపింది. 1971లో చంద్రకళ, శోభన్ బాబు సీతా రాములుగా సంపూర్ణ రామాయణం చిత్రంలో నటించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఒక మాస్టర్ పీస్. 

  కేరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే తన తొందర పాటు నిర్ణయాల వల్ల చంద్రకళ ఇబ్బందులు ఎదుర్కొందట. భారీగా ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఓ వ్యక్తిని ప్రేమించి విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి ముస్లిం యువకుడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడితో పెళ్లి తర్వాత చంద్రకళ జీవితంలో కష్టాలు మొదలయ్యాయట. దీనితో అతడికి దూరంగా విదేశాల నుంచి తిరిగి వచ్చేసింది. భర్త మోసం చేయడంతో చంద్రకళ ఒంటరిగా మిగిలింది. 

అయితే చంద్రకళ జీవితం ఎవరూ ఊహించని విధంగా విషాదాంతంగా ముగిసింది. 49 ఏళ్ళ వయసులోనే ఆమె మరణించారు. ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం దసరా బుల్లోడులో చంద్రకళ కూడా మెరిసింది. ఆ చిత్రంలో చంద్రకళ ఏఎన్నార్ కి మరదలిగా నటించి మెప్పించింది. ఈ చిత్రంలో చంద్రకళ క్యాన్సర్ పేషేంట్ గా నటించింది. షూటింగ్ సమయంలో ఏఎన్నార్ ఆమెని చూసి నిజంగానే క్యాన్సర్ పేషేంట్ లా ఉన్నావే అని సరదాగా అన్నారట. కానీ అదే ఆమె నిజజీవితంలో నిజమైంది. 

ఆ తర్వాత రోజుల్లో చంద్రకళ నిజంగానే క్యాన్సర్ బారీన పడింది. క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకోలేక 49 ఏళ్ళ వయసులోనే మృత్యువాత పడింది. నటనతో అభినయంతో మెప్పించిన చంద్రకళ జీవితం ఇలా ముగియడం నిజంగా బాధాకరం. 

click me!