నేనూ ఐపీఎల్ చూస్తా, అపార్థం చేసుకోవద్దు.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

By tirumala ANFirst Published May 4, 2024, 10:45 PM IST
Highlights

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ఇటీవల ట్రోలింగ్ జరిగింది. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఐపీఎల్ ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ఇటీవల ట్రోలింగ్ జరిగింది. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఐపీఎల్ ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది. థియేటర్స్ కి ఆడియన్స్ రావడం తగ్గింది. దీనితో ఇటీవల విడుదలైన చిత్రాలకు వసూళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. 

దీనితో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఐపీఎల్ గురించి కాస్త ఘాటుగా కామెంట్స్ చేశారు. ఐపీఎల్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. సాయంత్రం వచ్చి థియేటర్స్ లో సినిమా చూడండి. ఫోన్ లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనితో అనిల్ రావిపూడిపై నెటిజన్లు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. 

సినిమాలకంటే ఐపీఎల్ నే మేలు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునిగిపోవు నిజమే.. మరి సినిమాలు చూడకపోతే మురిగిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనితో అనిల్ రావిపూడి మరో ఈవెంట్ లో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ లో సినిమా కలెక్షన్స్ గురించి ఓ డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడా. ఆయన చెప్పిన విషయాన్ని వివరించే క్రమంలో ఫ్లో లో ఐపీఎల్ గురించి ఆ మాట అన్నా. అపార్థం చేసుకోవద్దు. 

నేను కూడా ఐపీఎల్ చూస్తా. మీరూ చూడండి. అదే విధంగా సినిమాలని కూడా అకరించండి అని అనిల్ కోరాడు. తాను మాట్లాడిన మాటలు వేరే రకంగా జనాల్లోకి వెళ్లాయని.. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. 

click me!