ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఎక్కువ కేలరీలు ఉండే ఆహారాలకు బదులుగా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. పిజ్జాకు బదులుగా సలాడ్ తీసుకోండి. లేదా చిప్స్ కు బదులుగా పాప్ కార్న్, పనీర్, మొక్కజొన్న లేదా టోఫుతో భర్తీ చేయండి. ఎన్నో పోషకాలను కలిగి ఉన్న, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. మీ ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. అలాగని కేలరీలను మరీ ఎక్కువగా తగ్గిస్తే మాత్రం మీ శరీరంలో శక్తి స్థాయిలు తగ్గుతాయి. తొందరగా నీరసంగా మారిపోవడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.