చిన్నారి బిఆర్ఎస్ అభిమాని ముద్దుముద్దు మాటలు ... కేటీఆర్ ఫిదా (వీడియో)

By Arun Kumar PFirst Published May 5, 2024, 3:05 PM IST
Highlights

ఓ చిన్నాారి ముద్దుముద్దు మాటలతో భారత రాష్ట్ర సమితి పార్టీపై అభిమానాన్ని చూపిస్తుంటే కేటీఆర్ ఫిదా అయిపోయారు. ఆ బాలిక వీడియోకు తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 

హైదరాబాద్ : అమాయకత్వంతో కూడిన చిన్నారుల ముద్దు ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. ఇక మనగురించో, మనకు నచ్చిన విషయాల గురించో మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆనందమే మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొందారు. బిఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఓ చిన్నారి మాట్లాడుతున్న వీడియోను ఆమె కుటుంబసభ్యులు ఎక్స్ వేదికన కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసారు. ఆ చిన్నారి మాటలకు ఫిదా అయిపోయి కేటీఆర్ వీడియోపై  స్పందించారు. 

''కేటీఆర్ గారు మా ఇంట్లో ఈ కరుడు గట్టిన  బిఆర్ఎస్ వాదితో తట్టుకోలేకపోతున్నాం... ఒక్కసారి అయినా కెసిఆర్ తాతని, కేటీఆర్ గారిని కలవాలి అంటుంది. రోజు ఇంట్లో ఇదే గొడవ'' అంటూ చిన్నారి ముద్దుముద్దు మాటలతో కూడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసారు. తనకు ట్యాగ్ చేసిన ఈ ట్వీట్ పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ''నెక్ట్స్ జనరేషన్ లీడర్... ఈ చిన్నారిని కలవడానికి ఎంతో ఇష్టపడుతున్నాను'' అంటూ కేటీఆర్ స్పందించారు. 

చిన్నారి ముద్దు మాటలతో వీడియో సాగిందిలా : 

తల్లిదండ్రుల ప్రభావమో లేక మొన్నటివరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వుండటమో... కారణం ఏదయినా చిన్నారి బిఆర్ఎస్ పార్టీపై ఇష్టాన్ని పెంచుకుంది. ఎంతలా అంటే స్కూల్లోని తోటి విద్యార్థుల్లో బిఆర్ఎస్ ను ఇష్టపడేవారితోనే స్నేహం చేస్తోందట. ఓ అమ్మాయి మొదట్లొ బిఆర్ఎస్ ఇష్టమని చెబితే స్నేహం చేసిందట... ఇప్పుడు కాంగ్రెస్ ఇష్టమని చెబితే ఆమెతో స్నేహాన్ని కూడా కట్ చేసుకుందట. ఇలా బిఆర్ఎస్ పార్టీపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది చిన్నారి. 

బిఆర్ఎస్ పార్టీని ఎందుకంత ఇష్టపడుతున్నావని సదరు చిన్నారిని అడగ్గా... పేదవాళ్లకోసం ఈ పార్టీ ఎంతో చేసిందని చెబుతోంది. బిఆర్ఎస్ పాలనలో పుష్కలంగా నీరు వుండేదని... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీటికొరత వచ్చిందని చెప్పుకొచ్చింది. చివరకు తాగే నీటిని ట్యాంకర్లతో పంటపొలాలకు పట్టే పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. 

చివరో మరోసారి బిఆర్ఎస్ పార్టీని కొనియాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చదువులు కూడా సరిగ్గా చెప్పడంలేదని చెప్పుకొచ్చింది. తమ స్కూళ్లోని అన్ని సబ్జెక్ట్స్ టీచర్లు బిఆర్ఎస్ వాళ్లేనని ఆ చిన్నారి చెప్పుకొచ్చింది. ఇదంతా విన్న కుటుంబసభ్యులు ఎమ్మెల్యే అవుతావా అని అడగ్గా సిగ్గుపడిపోయింది. కేటీఆర్ స్పందించిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

❤️ Would love to meet this little one. Next gen leader https://t.co/KbjoDToFzn

— KTR (@KTRBRS)


 
 

click me!