ఉల్లిగడ్డ తింటే బరువు తగ్గుతరా?

First Published | May 5, 2024, 3:05 PM IST

మనం రోజూ కూరల్లో వేసే ఉల్లిగడ్డ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు ఉల్లిగడ్డ బరువును ఎలా తగ్గిస్తుందో తెలుసా? 
 

టమాటాల మాదిరిగానే ఉల్లిగడ్డను కూడా మనం ప్రతి కూరలో వేస్తుంటాం. ఎందుకంటే ఉల్లిపాయలతో కూర మరింత టేస్టీగా అవుతుంది. అందుకే ప్రతి వంటింట్లో ఉల్లిగడ్డ ఖచ్చితంగా ఉంటుంది. ఉల్లిగడ్డ కూరల్ని టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉల్లిగడ్డ చేసే ఒక మేలు గురించి మాత్రం మనలో చాలా మందికి తెలియదు. అదేంటంటే.. బరువును తగ్గిస్తుందన్న సంగతి. అవును ఉల్లిగడ్డ బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కరిగే ఫైబర్

ఉల్లిపాయలు కరిగే ఫైబర్ కు మంచి వనరులు. ఈ ఫైబర్ కంటెంట్ మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. కేలరీల ఫుడ్ ను తినడాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కలిపి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఉల్లిపాయల్ని ఎంచక్కా తినొచ్చు. 
 

Latest Videos


జీవక్రియను పెంచుతుంది 

మన జీవక్రియ ఎంత వేగంగా ఉంటే మనం బరువు తగ్గడం అంత  సులువు అవుతుంది. అయితే ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీవక్రియను పెంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశమే ఉండదు. 
 

కేలరీలు తక్కువ

బరువు తగ్గాలనుకుంటే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. లేదంటే శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోయి మీరు బాగా బరువు పెరిగిపోతారు. అయితే ఉల్లిపాయలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు ఉల్లిపాయలో 64 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఉల్లిపాయల్ని రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. 
 

చర్మానికి మంచిది

ఉల్లిపాయల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ చర్మానికి హాని కలిగించే యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. ఉల్లిపాయలు తింటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

onion

ఎముకల ఆరోగ్యం

ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మనం మన పనులను చేసుకోగలుగుతాం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మీ రోజువారి ఆహారంలో ఉల్లిపాయలను చేర్చడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!