ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published May 5, 2024, 4:00 PM IST

ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్లాస్టిక్ సంచుల నుంచి సీసాల వరకు జనాలు ప్లాస్టిక్ ను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బాటిల్ వాడకం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనల్ని మనం హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఇందుకోసం నీళ్లను పుష్కలంగా తాగాలి. అయితే చాలా మంది ఈ సీజన్ లో కూల్ వాటర్ నే ఎక్కువగా తాగుతుంటారు. ఇందుకోసం ప్లాస్టిక్ బాటిల్స్ ను నింపి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఈ నీళ్లనే తాగేస్తుంటారు. కానీ ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. 
 

ప్లాస్టిక్ కేవలం పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఒక పరిశోధన ప్రకారం..ఒక బాటిల్ నీటిలో పావు మిలియన్ ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. అలాగే వీటిలో 10% మైక్రోప్లాస్టిక్స్, 90% నానోప్లాస్టిక్స్ ఉంటాయి. మైక్రోప్లాస్టిక్స్ మనిషి శరీరంలోని జీర్ణ, శ్వాసకోశ, ఎండోక్రైన్, పునరుత్పత్తి, రోగనిరోధక వ్యవస్థలు వంటి ఎన్నో వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రొమ్ము క్యాన్సర్

ప్లాస్టిక్ బాటిల్ వేడికి గురైనప్పుడు డయాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం కారణంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
 

తక్కువ స్పెర్మ్ కౌంట్, వంధ్యత్వం

ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నారు. అలాగే చాలా మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ప్లాస్టిక్ బాటిల్ లో ఉండే థాలేట్ కూడా దీనికి ఒక కారణమంటున్నారు నిపుణులు.
 

హార్మోన్ల అసమతుల్యత

ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బీపీఏ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. బీపీఏ హార్మోన్ల అసమతుల్యతను ప్రేరేపిస్తుంది. దీని వల్ల యుక్తవయస్సు కూడా త్వరగా వస్తుంది. అలాగే డయాబెటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. 

బలహీనమైన రోగనిరోధక శక్తి

ప్లాస్టిక్ బాటిళ్లలోని వాటర్ ను తాగితే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. నిజానికి దీనిలో ఉండే  ఉండే మైక్రోప్లాస్టిక్స్ మన రక్తప్రసరణలోకి వెళతాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.

click me!