ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే..!

First Published Aug 23, 2022, 11:51 AM IST

మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామంతో పాటుగా.. హెల్తీ ఫుడ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడతాయని శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. 
 

మన శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వుతో ఎలాంటి హాని జరగదు. కానీ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతేనే ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. అదనపు కొవ్వు స్ట్రోక్, గుండెపోటుకు వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు కొన్ని హెల్తీ ఆహారాలు సహాయపడతాయి. అవేంటంటే.. 

గ్రీకు పెరుగు

గ్రీకు పెరుగులో కొవ్వు బర్నింగ్ ను పెంచే కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇక పెరుగులో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ కు మేలు చేసే మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడతుంది. పెరుగులో కాల్షియం, విటమన్ డి, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి బరువును ఫాస్ట్ గా తగ్గిస్తాయి. 
 

అవకాడో

అవకాడోల్లో విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే చాలా మంది వీటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. 
 

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటుగా ఆకలిని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది. 
 

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. గుడ్డు బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడతుంది. బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్ లో ఒక ఉడకబెట్టిన గుడ్డును తినండి. ఇది మిమ్మల్ని వేగంగా బరువు తగ్గిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ప్రోటీన్ కంటెంట్  జీవక్రియ రేటును పెంచుతుంది. మీకు తెలుసా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ను తిన్న తర్వాత 30 శాతం జీవక్రియ రేటు పెరుగుతుంది. 
 

మిరపకాయలు

మిరపకాయల్లో ఉండే థర్మోజెనిక్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాదు ఇది శరీరం శక్తిని ఉపయోగించే వేగాన్ని కూడా పెంచుతుంది. 
 

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీలను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండి.. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. బ్లూబెర్రీలను తినడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 
 

తృణధాన్యాలు

తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. జీర్ణక్రియను  ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలు ఉత్తమం. 
 

గ్రీన్ టీ

పాలు, పంచదార కలిపి టీ కంటే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ పానీయాన్ని కొవ్వును వేగంగా కరిగించే పానీయాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనిలో ఉండే ఎపిగాల్లో కాటెచిన్ గలేట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. దీనిలో కెఫిన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. 

click me!