ఈ చిత్రంలో ఇలియానా నోరా అనే పాత్రలో నటించింది. ఈ పాత్ర తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందట. నోరా లాగే నేను కూడా చాలా సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది. నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి ఉండాలని చాలా సార్లు కోరుకున్నా. నన్ను ప్రేమించే వ్యక్తిని పబ్లిక్ గా హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, బాగా నమ్మడం లాంటివి పబ్లిక్ లో చేయడానికి నేను వెనుకాడను అని ఇలియానా తెలిపింది.