ఫిట్ నెస్ కోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా? డేంజరేనట...

First Published Sep 16, 2021, 2:48 PM IST

రోజుమొత్తంలో మీరు తాగే పానీయాలు, తినే ఆహారపదార్థాల్లో ఎంతో కొంత మొత్తంలో కేలరీలు తప్పనిసరిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే మీరు తీసుకునే కేలరీల మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కేలరీలను నిర్ణీత మొత్తానికి పరిమితం చేయాలి. లేకపోతే అధిక బరువుకు కారణమవుతాయి. 

జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన 2015 అధ్యయనం ప్రకారం, 20 శాతం కంటే ఎక్కువ ప్రోటీన్లతో కూడిన ఆహారం.. ముఖ్యంగా జంతు ప్రోటీన్ ఆహారం తీసుకున్న వ్యక్తుల శరీర బరువు రోజులో 15 శాతంకంటే తక్కు ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకునే వారితో పోల్చితే 10 శాతం ఎక్కువ పెరిగే అవకాశం ఉందట. ఎలాగంటే...

ఎక్కువ ప్రోటీన్ అంటే ఎక్కువ కేలరీలన్నమాటే.. : రోజుమొత్తంలో మీరు తాగే పానీయాలు, తినే ఆహారపదార్థాల్లో ఎంతో కొంత మొత్తంలో కేలరీలు తప్పనిసరిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటే మీరు తీసుకునే కేలరీల మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కేలరీలను నిర్ణీత మొత్తానికి పరిమితం చేయాలి. లేకపోతే అధిక బరువుకు కారణమవుతాయి. ముఖ్యంగా జంతు ఆధారిత ప్రోటీన్ తీసుకుంటే.. అందులోనిఅదనపు కేలరీలన్నీ శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. అటోమెటిగ్గా ఇది మీ బరువుపై  ప్రభావం చూపిస్తుంది.

ఫిట్ గా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం.. ఇది నేటి యూత్ ఎక్కువగా ఫాలో అవుతున్న మంత్రం.. దీనికోసం బరువుతగ్గే ఎన్నో డైట్ ప్లాన్స్ ఫాలో అవుతున్నారు. అయితే బరువు తగ్గే విషయంలో ముఖ్యంగా పాటించే మూలసూత్రం ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. 

దీనివల్ల కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాల వల్ల చేరే క్యాలరీలను తగ్గించుకోవచ్చనేది ఫిట్ నెస్ గురూలతో పాటు అందరూ చెప్పే విషయం. అయితే కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్లు తినడం వల్ల కూడా మీ బరువు తగ్గే ప్రయత్నం బెడిసి కొడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రోటీన్లు కణాల మధ్య బిల్డింగ్ బ్లాక్ గా పనిచేసి కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. పిండిపదార్థాలను, కొవ్వును ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారంతో రీప్లేస్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చు. అయితే ప్రోటీన్ లో కూడా క్యాలరీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. 

పిండిపదార్థాలను తగ్గించడం అంటే.. అతిగా తినడాన్ని ప్రోత్సహించడమే.. 
ప్రోటీన్స్ అనేవి ఎస్సెన్సియల్ మైక్రో న్యూట్రియంట్స్.. మంచిదే ఒప్పుకుదాం.. కానీ దీంతోపాటు పిండి పదార్థాలు,  కొవ్వులు తగినంతగా తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రతీ పోషకపదార్థానికి శరీరంలో ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. దాన్నిమీ ఆహారం నుండి తీసివేయడం అంటే.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవలసి వస్తుంది. 

ఆహారంలో పిండిపదార్థాలను తగ్గించడం వల్ల అది మీ మానసిక స్థితి మీద ప్రభావితం చూపిస్తుంది. చివరికి అనారోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రేరేపిస్తుంది. దీంతో అతిగా తినడానికి దారితీస్తుంది. దీనికి కారణం గ్లూకోజ్.. ఇది మన శరీరానికి ముఖ్యమైన శక్తి సోర్స్.. ఇది పిండి పదార్థాల నుండి వస్తుంది. చివరకు మెదడు పిండి పదార్థాలు దొరికితే ఇంకా కావాలన్న కోరికను ప్రేరేపిస్తుంది.. దీంతో అతిగా తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తక్కువ ఫైబర్ దెబ్బతీస్తుంది : ఫైబర్ కు మంచి సోర్స్ పిండి పదార్థాలు. ఫైబర్ ఆహారంలోని ద్రవాల్ని పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మనసులో సంతృప్తిని పెంచుతుంది. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం మీదికి మనసుపోకుండా చేస్తుంది. ఫైబర్ ఎక్కువ సేపు పొట్టను నిండుగా ఉంచుతుంది. మీ గట్ బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ మీరు ఫైబర్ తగ్గించి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటుంటే, మీ గట్ బ్యాక్టీరియాకు ఆహారం అందదు. ఇది వివిధ జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. మీ శరీరం బరువు తగ్గాలంటే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలి.

అధిక ప్రోటీన్ వల్ల అనర్థాలు : అధిక ప్రోటీన్ ఆహారం బరువు పెరగడానికి మాత్రమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. 

కిడ్నీ డిజార్డర్ : అధిక ప్రోటీన్ మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇప్పటికే మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. 

గుండె సమస్యలు : జంతుఆధారిత ప్రోటీన్ వనరుల్లో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తాయి. 

మలబద్ధకం: అధిక ప్రోటీన్ తీసుకోవడం, తక్కువ కార్బ్ తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. పిండి పదార్థాలలో ఉండే ఫైబర్ మలవిసర్జనను సులభం చేస్తుంది. అది లోపించడంతో ఈ సమస్య వస్తుంది. 

మరి రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి అంటే...సాధారణంగా... పెద్దవాళ్లు ప్రతిరోజూ వారి శరీర బరువులో కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్ తినాలి. కండల కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రతిరోజూ వారి శరీర బరువు కిలోకు 1.2-1.7 గ్రాముల ప్రోటీన్ వరకు తీసుకోవచ్చు.

click me!