లాంచ్ ఆఫర్ విషయానికొస్తే, ఆన్‌లైన్‌లో Vivo V30e స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు HDFC, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు ICICI, SBI, Indusland, IDFC ఇతర బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొత్త V30e స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo V30e 5500mAh బ్యాటరీతో స్లిమ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ తెలిపింది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ (సోనీ IMX882) ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. వెల్వెట్ రెడ్ అండ్ సిల్క్ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. Vivo V30e స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-బుకింగ్ కూడా ప్రారంభమైంది.
undefined
లాంచ్ ఆఫర్ విషయానికొస్తే, ఆన్‌లైన్‌లో Vivo V30e స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు HDFC, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లు ICICI, SBI, Indusland, IDFC ఇతర బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది.
Vivo V30e స్మార్ట్‌ఫోన్ 93.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190 గ్రాములు. ఇమేజింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ OISతో 50MP (Sony IMX 882) ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ కెమెరా సెటప్ Vivo రింగ్-ఆకారపు "స్మార్ట్ ఆరా లైట్" ద్వారా ఫినిష్ చేయబడింది. ఇంకా స్మార్ట్‌ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ అలాగే మరో 50MP కెమెరా ఉంది.
Vivo V30e Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్, 5500mAh బ్యాటరీతో వస్తుంది, దీనికి 44W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Vivo FunTouchOS 14ని స్మార్ట్‌ఫోన్ బూట్ చేస్తుంది.
ఫోన్ అప్షన్స్ 8GB RAM + 128GB ROM ధర రూ. 27,999 కాగా, 8GB RAM + 256GB ROM మోడల్ ధర సుమారు రూ. 29,999. ఆన్‌లైన్‌లో ఇంకా మే 9 నుండి రిటైలర్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.