Chandrababu Election Promises : టీడీపీ కూటమి సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, 3000 రూపాయల నిరుద్యోగ బఈతి, రైతుకు ఏటా 20 వేల సాయం, ప్రతి ఇంటికి 3 సిలిండర్ల గ్యాస్ ఉచితం, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి స్కూల్ విద్యార్ధికి ఏడాదికి 15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా అనేక హామీలు కురిపించారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా..?
Andhra Pradesh Assembly Elections 2024 : ప్రస్తుతం దేశంలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పార్టీలు ఓటర్లకు గాలం వేయడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. హామీల అమలు సాధ్యాలతో సంబంధం లేకుండా మేనిఫెస్టోలతో ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు ప్రకటిస్తున్న హామీలు హాట్ టాపిక్ గా మారాయి.
టీటీపీ, జనసేన, బీజేపీల కూటమి సైతం సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాయి. ఇందులో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, 3000 రూపాయల నిరుద్యోగ భృతి, రైతుకు ఏటా 20 వేల సాయం, ప్రతి ఇంటికి 3 సిలిండర్ల గ్యాస్ ఉచితం, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి స్కూల్ విద్యార్ధికి ఏడాదికి 15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా మేనిఫెస్టోలో హామీలు వర్షం కురిపించారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా..? అనే చర్చ సాగుతోంది. ఇదే విషయాలు ప్రస్తావిస్తూ ఇతర పార్టీలు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.
undefined
నిజంగానే చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదా? సాధ్యం కాకపోతే ఎందుకు ఇలా చేస్తున్నట్టు? ఇతర పార్టీలు చేస్తున్న విమర్శల్లో అసలు నిజమేంటి? ఇలా పలు అంశాలను గమనిస్తే.. విస్తుపోయే విషయాలు కనిపిస్తున్నాయి. ఏదైనా హామీలు ఇస్తుంటే దాని అమలు, బడ్జెట్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇలాంటివి వర్తిస్తాయి. సూపర్ సిక్స్ హామీలలో ఇచ్చిన హామీలు భారీ బడ్జెట్ తో కూడుకున్నవిగా రాజకీయ, ఆర్ధిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందులో బీసీ మహిళలకు పెన్షన్ హామీని పరిశీలిస్తే.. ఈ వర్గం మహిళలు దాదాపు 32-33 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4వేల చొప్పున ఇవ్వాలంటే నెలకు దాదాపు రూ.1,400 కోట్లు కావాలి. ఇక నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3000 ఇవ్వాలంటే రాష్ట్రంలోని 20 లక్షలమందికీ రూ.600 కోట్లు కావాలి.
దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షన్లతో కలిపి నెలకు రూ.4,800 కోట్లు, వాలంటీర్లు 2 లక్షల 65 వేల మంది ఉన్నారు, ఒక్కొక్కరికీ రూ.10 వేలు అంటే రూ.265 కోట్లు కావాల్సి ఉంటుంది. అలాగే, రాష్ట్రంలోని 18 -50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం దాదాపు రూ.1,200 కోట్ల వరకు అవుతుంది. అంటే మొత్తం దాదాపు రూ.13,200 కోట్లు ప్రతి నెలా ఉంటాయి. అంటే రాష్ట్ర ఖజానాకు వచ్చే రాబడులు భారీగా పెరిగితేనే ఇలాంటి హామీలు నెరవేర్చడానికి సాధ్యమవుతుంది. వైసీపీ గతంలో చంద్రబాబు పాలన గురించి ప్రస్తావిస్తూ బాబు ఐదేళ్లపాటు సృష్టించిన సంపద.. పదవీకాలం పూర్తి చేసుకునే సమయానికి ఖజానాలో ఉన్న సంపద రూ.100 కోట్లుగా పేర్కొంది. అంటే రాష్ట్ర బడ్డెట్ భారీ స్థాయిలో ఖజానా లేకుండా హామీలు ఎలా సాధ్యం అవుతాయనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
దీంతో పాటు ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పిల్లకు పెట్టె ఆహారం, వసతిదీవెన, విద్యాదీవెన ప్రభుత్వ బడుల్లో నాడు-నేడు పనులు ఇవన్నీ కాకుండానే మామూలుగా పథకాలకు ప్రతి నెలా రూ.13,200 కోట్లు కావాలి. ఇతర పార్టీలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హామీలు కురిపిస్తున్నాయి. అవి సాధ్యం చేయడానికి అయ్యేవా? కానివా? అనే విషయాల పట్ల ఓటర్లు అమ్రత్తంగా ఉండాలనే విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.