అందానికి మెరుగులు దిద్దే విటమిన్-సి.. వాడితే మెరిసిపోతారంతే...

First Published Jun 4, 2021, 2:11 PM IST

బ్యూటీ, చర్మ సంరక్షణ విషయంలో విటమిన్ సి పోషించే పాత్ర చెప్పలేనిది. పేస్ మాస్క్ లు, క్రీమ్ లు, ఫేస్ వాష్ లు..ఇలా అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్ లలో సహజసిద్ధమైన విటమిన్ సి తప్పనిసరిగా ఉంటుంది. 

బ్యూటీ, చర్మ సంరక్షణ విషయంలో విటమిన్ సి పోషించే పాత్ర చెప్పలేనిది. పేస్ మాస్క్ లు, క్రీమ్ లు, ఫేస్ వాష్ లు..ఇలా అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్ లలో సహజసిద్ధమైన విటమిన్ సి తప్పనిసరిగా ఉంటుంది.
undefined
చర్మసంరక్షణలో అద్భుతంగా పనిచేసే విటమిన్ సి ప్రయోజనాలు నేడు ప్రపంచానికి కంతటికీ తెలుసు. వినియోగదారులకు మునుపెన్నడూ లేనంత ఎక్కువ అవగాహన దీనిమీద ఏర్పడింది. అందుకే సహజ పదార్దాలతో సమృద్ధిగా ఉన్న ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
undefined
చర్మసౌందర్య, చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉండే విటమిన్ సి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూడండి..
undefined
సూర్యరశ్మివల్ల చర్మానికి హాని కలగకుండా కాపాడుతుంది. విటమిన్ సి ప్రధాన ప్రయోజనాల్లో ఫోటోప్రొటెక్షన్ ఒకటి. విటమిన్ సి చేసే అద్భుతాల్లో ఇదొకటి.
undefined
ఎండవల్ల చర్మం కమిలిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు అంతకుముందే ఏర్పడ్డ సన్ టాన్ ను కూడా తొలగించడానికి సాయపడుతుంది.
undefined
హైపర్పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. అనేక కారణాల వల్ల చర్మం మీద నల్ల మచ్చలు, మరకలు ఏర్పడతాయి. దీన్నే హైపర్పిగ్మెంటేషన్ అంటారు.
undefined
విటమిన్ సి చర్మపు హైపర్పిగ్మెంటేషన్ తగ్గించి, సహజకాంతితో మెరిసిపోయేలా చేస్తుంది.
undefined
ముఖం, చర్మం మీద ఫైన్ లైన్స్ వయసు మీద పడుతుందనడానికి చిహ్నాలు. వీటిని అంత తొందరగా రానివ్వకుండా కాపాడడంలో విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా విటమిన్ సి సీరమ్ ను ఉపయోగిస్తున్నట్లైతే ఈ సమస్యనుంచి బయటపడవచ్చు.
undefined
దీనివల్ల ముఖం ప్రకాశవంతంగా మారి.. మీలో ఆత్మవిశ్వాం పెరుగుతుంది.
undefined
విటమిన్ సి చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. తేమను నిలుపుకోవడంలో చర్మానికి సహాయపడుతుంది. ఈ విషయాన్ని చర్మ సంరక్షణ నిపుణులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నారు.
undefined
ఆరోగ్యకరమైన చర్మానికి హైడ్రేషన్ చాలా ముఖ్యమైనది. కాబట్టి, ఆ ప్రయోజనాన్ని చర్మానికి కలిగించే విటమిన్ సి కచ్చితంగా అద్భుతమైనదే.
undefined
click me!