'కాశ్మీర్'లో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!

First Published Dec 4, 2021, 2:05 PM IST

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని మంచి పర్యాటక ప్రదేశం కాశ్మీర్ (Kashmir) అని చెప్పవచ్చు. ఇది ఇండియాలోనే అద్భుతమైన హిల్ స్టేషన్ (Hill station) లలో ఒకటిగా ప్రసిద్ధి. ఇక్కడి అందమైన ఎత్తైన శిఖరాలు, లోయలు, ఆలయాలు, సరస్సులు కాశ్మీర్ ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ అందాలను తిలకించడానికి పర్యాటకులు భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ కాశ్మీర్ సందర్శన పర్యాటకులకు కనువిందును కలిగిస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా కాశ్మీర్ లో అద్భుతమైన సందర్శనీయ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం..
 

కాశ్మీర్ సందర్శన ఒక మధురమైన తీయని జ్ఞాపకంగా (Memory) మిగిలిపోతుంది. ఇక్కడ ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంత సందర్శనకు మార్చి నుండి అక్టోబర్ నెల వరకు అనుకూలమైనది. ఈ ప్రాంతంలోని ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగివుండి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి.
 

కాశ్మీర్ లో లభించే ఆహార పదార్థాలు (Foods) చాలా రుచిగా ఉంటాయి. మీరు కాశ్మీర్ సందర్శనకు (Visit) వెళ్లినప్పుడు అక్కడ ఆహారపదార్థాలను ఒకసారి రుచి చూడండి. ఇప్పుడు కాశ్మీర్ లో సందర్శించడానికి వీలుగా ఉండే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

దళ్ సరస్సు: శ్రీనగర్ ప్రధాన ఆకర్షణగా దళ్ సరస్సు (Dal Lake) ఉంది. దళ్ సరస్సులోని నీటి క్రీడలు (Water sports) పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. కేనోయింగ్ ఆంగ్లింగ్, స్విమ్మింగ్ కయాకింగ్, వాటర్ సర్ఫింగ్ లు దళ్ సరస్సులోని ప్రధాన క్రీడలు. ఈ సరస్సు సందర్శన పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
 

కార్గిల్: ఈ ప్రదేశంలోనే 1999లో పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగింది. కార్గిల్ (Kargil) ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షించేలా వుంటాయి. కార్గిల్ నుండి శ్రీనగర్, పాడుం, లెహ్ లకు ప్రయాణించడానికి రోడ్డు సౌకర్యం (Road facility) కలదు. ట్రెక్కింగ్, మౌంటే నీరింగ్ లకు కార్గిల్ చక్కని అనుకూలమైన ప్రదేశం. కార్గిల్ లో మొనాస్టరీ, పాడుం, షార్ గోల్ మొనాస్టరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
 

అల్చి: ప్రశాంతతను కోరుకునే పర్యాటక ప్రియులకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు ప్రశాంతతను చేకూరుస్తాయి. అల్చిలో (Alchi) ప్రధాన ఆకర్షణగా అల్చి బౌద్ధ ఆరామం, సామ్ టి సేక్, మంజు శ్రీ టెంపుల్ (Manju Shree Temple) లు ఉన్నాయి. వీటిని సందర్శన పర్యాటకులకు చక్కని అనుభూతిని కలిగిస్తాయి
 

అమరనాథ్: అమర్నాథ్ (Amarnath) యాత్రా స్థలం శ్రీనగర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రముఖ హిందూ తీర్థయాత్ర స్థలాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఇక్కడ మరొక దర్శనీయ ప్రదేశంగా శేష నాగ సరస్సు (Shesha Naga Lake) ఉంది. ఇది ఒక పరమ పవిత్రమైన సరస్సుగా భక్తులు భావిస్తారు. ఈ సరస్సులో స్నానమాచరించిన  పునీతులవుతారని భక్తుల నమ్మకం. ఇది తప్పక సందర్శించవలసిన ప్రదేశం. 
 

ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్: శ్రీనగర్ (Srinagar) ప్రధాన ఆకర్షణగా ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్ (Indira Gandhi Tulip Garden) ఉంది. ఇది దళ్ సరస్సుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీనగర్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఈ ప్రదేశ సందర్శన పర్యాటకులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది.

click me!