ఎన్నికల సమరంలో చిరంజీవి... ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ? పవన్ కి మేలు చేసేనా?

First Published Apr 30, 2024, 9:15 AM IST


చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సర్వం సిద్ధం అంటున్నాయి జనసేన వర్గాలు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారట. 
 

Chiranjeevi


టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పలువురు భావించారు. అయితే ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 18 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. 

Chiranjeevi


తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. స్థాపించిన 30 నెలల్లోనే పీఆర్పీ ప్రస్థానం ముగిసింది. ఓ సామాజిక వర్గం తీవ్ర నిరాశకు గురైంది. పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేయడాన్ని తప్పుబట్టారు. 
 

Chiranjeevi

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్చాడు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన క్రియాశీలకంగా లేరు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. కాగా ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ+టీడీపీ+జనసేనలకు ఆయన మద్దతు తెలపడం చర్చకు దారి తీసింది. 
 

Chiranjeevi

కాంగ్రెస్ లో ఉంటూ ఎన్డీయే కూటమిని ఎలా సపోర్ట్ చేస్తారనే విమర్శలు ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పి రమేష్ బాబులకు ఓటు వేసి గెలిపించాలని చిరంజీవి వీడియో విడుదల చేశారు.

Chiranjeevi

చిరంజీవి నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు అనేది సోషల్ మీడియా హాట్ టాపిక్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. అలాగే పలు నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమికి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారట. చిరంజీవి నేరుగా ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ కి మేలు జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది. 
 


దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. మరి అదే జరిగితే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లే. మరోవైపు చిరంజీవి ఈ షాడో పాలిటిక్స్ ఆపేయాలి. ఏదైనా ఉంటే నేరుగా బరిలో దిగాలని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తున్నారు. 
 

Chiranjeevi

ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం టాలీవుడ్ సెలెబ్స్ తో సందడిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని హైపర్ ఆది, నటుడు పృథ్వి , జానీ మాస్టర్, వరుణ్ తేజ్, నాగబాబు, జబర్దస్త్ కమెడియన్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవతో పాటు పలువురు ప్రచారం చేశారు.

click me!