Telangana SSC Results 2024 : తెలంగాణ టెన్త్ ఫలితాలు... ఇలా చెక్ చేసుకొండి...

By Arun Kumar PFirst Published Apr 30, 2024, 9:34 AM IST
Highlights

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  విద్యార్థులు తమ ఫలితాన్ని తెెలుసుకోవాలంటే ఇలా చేయండి...

హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 91 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలికలు 93  శాతం, బాలురు 89 శాతం ఉత్తీర్ణత సాదించారు. ఇలా పరీక్ష రాసిన 5,05,813 మందిలో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

తెలంగాణవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసారు. మార్చ్ 18 నుండి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరిగాయి. ఆ వెంటనే జవాబు పత్రాల మూల్యాంకన కూడా పూర్తిచేసారు. అయితే పరీక్షలు ముగిసిన నాటినుండి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా టెన్త్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ వారి ఎదురుచూపులకు తెర పడింది. 

తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్  bse.telangana.gov.in లేదా https://results.bsetelanganagov.in/ పై క్లిక్ చేసి విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. లేదంటే Manabadi వెబ్ సైట్ లో కూడా టెన్త్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి చాలా ఈజీగా ఫలితాలను తెలుసుకోవచ్చు. 

అయితే ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల  సందర్భంగా విద్యార్థులు చాలా ఒత్తిడికి గురయ్యారు. కొందరు విద్యార్థులు ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురయి ఆత్మహత్యకు కూడా చేసుకున్నారు. కాబట్టి పదో తరగతి ఫలితాల వెలువడిన తర్వాత విద్యార్థుల ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచిస్తున్నారు. విద్యార్థులు ధైర్యంగా వుండాలని... వారిపై తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచవద్దని అధికారులు సూచిస్తున్నారు.  
 

click me!