అధిక చెమట ఇబ్బంది పెడుతోందా? ఈ వంటింటి చిట్కాలు ట్రై చేసి చూడండి..

First Published Jun 21, 2021, 10:47 AM IST

అసలు చెమటలు ఎందుకు పడతాయి? అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ అధిక చెమటకు కారణమవుతాయి.

చెమట పట్టడం ఆరోగ్యానికి సూచిక. ఒంట్లోని మలినాలను విసర్జించడానికి శరీరం చేసే ఓ ప్రక్రియ. అయితే కొంతమందికి చెమటలు అస్సలే పట్టవు. మరికొంతమందికి కాస్త శ్రమపడితే చాలు విపరీతంగా చెమటలు వచ్చేస్తుంటాయి.
undefined
ఈ ఎక్కువ చెమటలు పట్టడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒంటినుంచి దుర్వాసన రావడం, బట్టలు పచ్చిగా అయిపోవడం బైటికి కనిపించి, ఇబ్బంది పెట్టే సమస్యలైతే..ఆరోగ్యం మీద పడే ప్రభావం వేరుగా ఉంటుంది.
undefined
ఎక్కువ చెమటలు పట్టడం అంటే హైపర్ హైడ్రోసిన్ అనే సర్వసాధారణమైన సమస్య. ముఖ్యంగా వేసవిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.
undefined
అసలు చెమటలు ఎందుకు పడతాయి? అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ అధిక చెమటకు కారణమవుతాయి.
undefined
మరి వీటి నుంచి విముక్తి లేదా... అంటే ఉంది.. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.
undefined
వెనిగర్ లో ఉండే రక్తస్రావాన్ని ఆపే గుణం వల్ల చెమటలు అధికంగా పట్టడాన్ని అదుపులో పెట్టవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఓ టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పడిగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
undefined
నిమ్మరసం సహజసిద్ధమైన డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఇది అధికచెమటనూ తగ్గిస్తుంది. నిమ్మకాయరసాన్ని మీ అండర్ ఆర్మ్స్ లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయండి.
undefined
కొబ్బరినూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెను అరిచేతితో వేసుకుని చంకలు, మోకాళ్ల వెనుక.. చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది.
undefined
అలోవెరా జెల్ లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్ ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
undefined
బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి చంకల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
undefined
బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీలో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో చంకల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

click me!