వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 30, 2024, 11:46 AM IST

మనలో చాలా మంది ఉదయం గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. ఇలా రెగ్యులర్ గా తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చాలా మంది ఉదయాన్నే వేడినీళ్లను తాగుతుంటారు. నిజానికి వేడి నీళ్లు మన శరీరానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. అలాగే మరికొంతమంది మాత్రం ఉదయాన్నే వేడి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటారు. కానీ దీనివల్ల ఏం ఏమౌతుందో మాత్రం చాలా మందికి తెలియదు. అసలు గోరువెచ్చని లెమన్ వాటర్ ను తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిమ్మకాయ లక్షణాలు

నిమ్మకాయ సిట్రస్ ఫ్రూట్. దీనిలో విటమిన్-సి, కరిగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 


lemon water

మొత్తం శరీరానికి మంచిది

ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని కలిపి తాగడం వల్ల మొత్తం శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మంది టేస్ట్ కోసం ఈ వాటర్ లో కొద్దిగా ఉప్పు లేదా తేనె కలుపుకుని తాగుతుంటారు. అసలు ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?
 

బరువు తగ్గడానికి..

ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాటర్ ను ఉదయాన్నే తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీనివల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు. 
 

చర్మ ఆరోగ్యం

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గోరువెచ్చని లెమన్ వాటర్ లో తగినన్ని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇలాంటి వాటర్ ను తాగడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. 

శరీరం హైడ్రేట్ 

శరీరం డీహైడ్రేట్ అయితే లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అయితే ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మీరు రీఫ్రెష్ గా కూడా ఉంటారు. 
 

రోగనిరోధక శక్తి

గోరువెచ్చని నిమ్మరసంలో ఉండే గుణాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. దీనివల్ల మీకు సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి అందుతుంది. అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే అవకాశం కూడా ఉండదు. 

ఎసిడిటీ నుంచి ఉపశమనం

గ్యాస్, ఎసిడిటీ సమస్యలున్న వారికి కూడా గోరువెచ్చని నిమ్మకాయ వాటర్ ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఈ వాటర్ గ్యాస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 

Latest Videos

click me!