ఈ ఒక్క పౌడర్ ఉంటే... ఎన్ని బ్రేక్ ఫాస్ట్ లు చేయవచ్చో తెలుసా?

First Published Apr 30, 2024, 12:22 PM IST

ఈ రోజు మనం  దాదాపు ఐదు, ఆరు వంటలకు ఉపయోగపడేలా ఒక పౌడర మిక్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క పౌడర్ మిక్స్ ని తయారు చేసుకుంటే... మనకు దాదాపు వంట చాలా ఈజీగా అయిపోతుంది

చాలా మందికి వంట చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది.  ముఖ్యంగా ఆపీసు పని, ఇంటి పనీ రెండూ చేసుకునే మహిళలకు వంట కాస్త కష్టంగానే ఉంటుంది. సింపుల్ గా అయిపోతే బాగుండు... ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే.. మనం కిచెన్ లో వంటను  చాలా సింపుల్ గా కొన్ని హ్యాక్స్ తో ఈజీ చేసేయవచ్చు. 
 

ఈ రోజు మనం  దాదాపు ఐదు, ఆరు వంటలకు ఉపయోగపడేలా ఒక పౌడర మిక్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క పౌడర్ మిక్స్ ని తయారు చేసుకుంటే... మనకు దాదాపు వంట చాలా ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగా ఇంట్లో అందరికీ ఎవరికి ఏ బ్రేక్ ఫాస్ట్ కావాలంటే ఆ బ్రేక్ ఫాస్ట్ మనం ఈజీగా చేసి ఇవ్వచ్చు. ఆ ప్రీమిక్స్  పౌడర్  ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం...
 

ఒక్కసారి ప్రీ మిక్స్ పౌడర్ తయారు చేసుకుంటే.... దాంట్లో మీరు పెరుగు, నీరు కలుపుకోని ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్రీ మిక్స్ పౌడర్ తో మీరు ఇడ్లీ, దోశ, ఉతప్పం, పునుగులు కూడా చేసుకోవచ్చు,

ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేయాలి?
కావాల్సిన పదార్థాలు 
1 కప్పు- పొట్టు తీయని మినపప్పు
2 టేబుల్ స్పూన్లు - చనా పప్పు
1 టీస్పూన్ మెంతి గింజలు
అర కప్పు అటుకులు
2 కప్పులు బియ్యం పిండి
1 టీస్పూన్ ఉప్పు
ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసే పద్దతి..
పదార్థాలన్నీ కలిపి మెత్తగా నూరి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.


ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ తో ఏ వంటలు ఎలా తయారు చేయాలో చూద్దాం... ముందుగా.. ఇడ్లీ చేయాలి అనుకుంటే.. తయారు చేసుకున్న ప్రీ మిక్స్ పౌడర్ ని ఒక కప్పు గిన్నెలో కి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, పెరుగు, నీరు వేసి.. ఇడ్లీ పిండి మిశ్రమం లా తయారు చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి... ఆ తర్వాత ఇడ్లీ వేసకోవడమే.  పెద్ద కష్టం లేకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే మీకు ఇడ్లీ పిండి తయారౌతుంది. 15 నిమిషాల్లో వేడి వేడిగా ఇడ్లీ కూడా రెడీ అవుతాయి.

ఇదే పిండిని ఇంకాస్త పలుచగా చేసి మనం పెనంపై పలుచగా దోశలు వేసుకోవచ్చు. కాస్త మందంగా వేసుకుంటే ఉతప్పం కూడా తయారౌతుంది.  ఒకేరోజు మీరు ఇంట్లో ఎవరికి ఏ బ్రేక్ ఫాస్ట్ కావాలంటే అది ఈజీగా నిమిషాల్లో చేసి వడ్డించవచ్చు. మీకు కూడా పెద్దగా శ్రమ పడిన ఫీలింగ్ కలగదు.

click me!