ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం టీంనే లేపేసిన గూగుల్.. అసలు కారణం ఏంటంటే..?

By Ashok kumar SandraFirst Published Apr 30, 2024, 11:18 AM IST
Highlights

 గత కొన్ని వారాల్లో గూగుల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. మీడియా నివేదికల ప్రకారం, సుందర్ పిచాయ్ నేతృత్వంలోని కంపెనీ ఇప్పుడు మొత్తం పైథాన్ టీమ్‌ను తొలగించింది. 
 

గత కొన్ని వారాల్లో  టెక్ దిగ్గజం గూగుల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి మీకు తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం, సుందర్ పిచాయ్ నేతృత్వంలోని కంపెనీ ఇప్పుడు  మొత్తం పైథాన్ టీమ్‌ను తొలగించింది. నివేదికల ప్రకారం, సంస్థ లేబర్ ఖర్చులను తగ్గించడానికి US బయట  ఉన్న ఉద్యోగులను తిరిగి చేర్చుకోవాలని Google నిర్ణయించింది.

గూగుల్ రియల్ ఎస్టేట్ అండ్  ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించిందని గతంలో బిజినెస్ ఇన్‌సైడర్ ఇటీవల వెల్లడించింది.  దింతో  Google  ట్రెజరీ, బిజినెస్  సర్వీసెస్, రెవెన్యూ  క్యాష్  ఆపరేషన్స్  వంటి బృందాలను ప్రభావితం చేసింది. బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్‌లో కంపెనీ విస్తరణను పెంచేందుకు పునర్నిర్మాణ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ ఉద్యోగులకు ఇమెయిల్ పంపారు.

అదనంగా, ఇంజినీరింగ్, హార్డ్‌వేర్ ఇంకా సపోర్ట్ టీమ్‌లతో సహా పలు టీమ్‌లలో జనవరిలో గూగుల్ వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.

నివేదిక ప్రకారం మాస్టోడాన్‌పై ఒక Social.coop పోస్ట్ లే-ఆఫ్‌ల వల్ల తీవ్ర నిరాశకు గురైన Google పైథాన్ బృందం మాజీ సభ్యులలో ఒకరి నుండి కామెంట్స్  వచ్చాయి. గూగుల్‌లో తమ  రెండు దశాబ్దాల కెరీర్ అత్యుత్తమ ఉద్యోగమని, కంపెనీ లేఆఫ్‌లను ప్రారంభించడం అన్యాయమని ఉద్యోగి పేర్కొన్నారు. మేనేజర్‌తో సహా మొత్తం టీమ్‌ను తొలగించి వారి స్థానంలో విదేశాలకు చెందిన రిమోట్‌ వర్కర్స్  నియమించడం బాధాకరమని మరో ఉద్యోగి అన్నారు. 

click me!