మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

First Published Dec 23, 2022, 4:16 PM IST

మెడనొప్పి వల్ల ఏ పనులను సరిగ్గా చేయలేం. ఈ మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయి. కారణం ఏదైతేనేం.. కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. 
 

గంటల తరబడి కూర్చుని లాప్ టాప్ లో పనిచేయడం వల్ల మెడనొప్పి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి కలుగుతుంది. చిన్న సమస్యే అని లైట్ తీసుకుంటే సమస్య మరింత పెద్దదయ్యే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటంటే..

మెడనొప్పికి కారణాలు

సరిగ్గా కూర్చోకపోవడం: కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువ సేపు ఉపయోగించేటప్పుడు సరిగ్గా కూర్చోని వారు చాలా మందే ఉన్నారు. దీనివల్ల కండరాలకు ఒత్తిడి కలుగుతుంది. మంచం మీద పడుకుని లేదా కూర్చొని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారితీస్తాయి. ఇది మెడనొప్పికి కారణమవుతుంది. 
 

neck pain

కీళ్ళు అరిగిపోవడం: శరీరంలోని ఇతర కీళ్ళ మాదిరిగానే మెడ కీళ్లు కూడా వయస్సుతో పాటుగా క్షీణిస్తాయి. వయస్సుకు సంబంధిత అరుగుదల అయితే ఎముక స్పర్స్ కు దారితీస్తుంది. దీనివల్ల మెడ కదలికలు ప్రభావితం అవుతాయి. దీనివల్ల నొప్పి కలుగుతుంది. 

గాయాలు: తల అకస్మాత్తుగా వెనుకకు, తరువాత ముందుకు కదిలినప్పుడు కూడా మెడనొప్పి కలుగుతుంది. 

కంప్రెస్డ్ నరాలు: మెడలోని ఎముక స్పర్స్ లేదా హెర్నియేటెడ్ డిస్క్ లు వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలను నొక్కుతాయి. దీనివల్ల కూడా మెడనొప్పి వస్తుంది.

వ్యాధి: మెడ నొప్పి మెనింజైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా క్యాన్సర్ వంటి అనేక అనారోగ్యాల సమస్యల వల్ల కూడా కలుగుతుంది. 
 

మెడ నొప్పిని తగ్గించే చిట్కాలు

1. సరైన భంగిమలో కూర్చోండి

కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు మీ భుజాలు మీ తుంటిపై ప్రత్యక్ష రేఖలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమలేఖనంలో ఉండేట్టు చూసుకోవాలి. వాస్తవానికి సెల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా చూడటానికి మీ మెడను వంచకూడుదు. అలా వంచకూడదంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో పెట్టండి. అలాగే మీ వర్క్ టేబుల్, కంప్యూటర్, కుర్చీని మీకు కంఫర్ట్ గా పెట్టండి. 
 

2. తరచుగా విరామం తీసుకోండి

మీరు ఎక్కువ సేపు డ్రైవ్ చేయాల్సి వచ్చినా.. లేదా స్క్రీన్ ముందు గంటల తరబడి పనిచేయాల్సి వచ్చినా.. మధ్య మధ్యలో రెస్ట్ ను తీసుకోండి. ముఖ్యంగా మీ మెడ, భుజాలను బాగా కదిలించండి. అలాగే మీ శరీరాన్ని సాగదీయండి. 
 

3. భుజాలపై  ఎక్కువ బరువును మోయకండి

మీ భుజాలు, చేతులపై ఎక్కువ బరువుండే బ్యాక్ ప్యాక్ లను మోయకండి. ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. మెడ నొప్పిని కలిగిస్తుంది.

4. కంఫర్ట్ ప్లేస్ లో పడుకోండి

మీ తల, మెడ.. మీ శరీరంలోని మిగిలిన భాగాలకు అనుగుణంగా ఉండాలి. మీ తలకింద పెద్ద సైజు దిండులను అసలే ఉపయోగించకండి. దిండు లేకుండా ఉండలేమనుకుంటే చిన్న దిండును మాత్రమే ఉపయోగించండి. వీపైపు పడుకోవడానికి ట్రై చేయండి. కాళ్ల కింద దిండును వేసుకుంటే మంచిది. దీనివల్ల మీ వెన్నెముక కండరాలు రిలాక్స్ అవుతాయి. 
 

ಕುತ್ತಿಗೆ ನೋವುಕಿಬ್ಬೊಟ್ಟೆ ಮೇಲೆ ಮಲಗುವುದರಿಂದ ಹೊಟ್ಟೆಮೇಲೆ ಹೆಚ್ಚು ಬಲ ಬೀಳುವುದರಿಂದ ಕುತ್ತಿಗೆಯಲ್ಲಿ ನೋವು ಉಂಟುಮಾಡುತ್ತದೆ. ಇದನ್ನು ತಪ್ಪಿಸಲು ಮಲಗುವ ವಿಧಾನವನ್ನು ಬದಲಾಯಿಸಿ.

5. దిండు వాడటం మానుకోండి
 
మెడ నొప్పి ఎంతకీ తగ్గకపోతే..  దిండు లేకుండా చదునైన నేలపైనే నిద్రపోయేలా చూసుకోండి. దిండును ఉపయోగించకపోవడం వల్ల మీ మెడపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఇది మీ మెడపై ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది.

6. జీవనశైలిలో మార్పులు

ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకండి. ఎక్కువగా తిరగండి. నడవండి. స్మోకించే చేసే అలవాటుంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే ఇది మెడ నొప్పి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

7. సాగదీయండి

ఇంటి నుంచి పనిచేయడం లేదా ల్యాప్ టాప్ ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ నొప్పి వస్తుంది. అయితే శరీరాన్ని సాగదీసే వ్యాయామాల వల్ల మెడనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. భుజం రోల్, సైడ్ రొటేషన్, డాల్ఫిన్ భంగిమ, శరీరాన్ని ముందుకు, వెనుకకు వంచడం మొదలైన వాటి వల్ల ఈ నొప్పి తగ్గే అవకాశం ఉంది. 
 

8. కోల్డ్ కంప్రెస్

మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, వాపు లేదా మంటను తగ్గించడానికి చల్లని లేదా హీట్ కంప్రెస్ రెండింటినీ ఉపయోగించొచ్చు. ఇది కండరాల సడలింపునకు సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. ఈ టెక్నిక్ ను 20 నిమిషాల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు. 

9. మసాజ్

మెడ నొప్పికి మసాజ్ థెరపీ వల్ల కండరాలను సడలించవచ్చు. అలాగే తీవ్రమైన మెడ నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది. 
 

click me!