బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

First Published | Mar 20, 2024, 9:58 AM IST

ముందే ఇది పెళ్లిళ్ల సీజన్. ఇంకేముందు బంగారాన్ని బాగా కొంటుంటారు. అయితే బంగారం కొనేవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటేనే మీరు నష్టపోరు. లేదంటే మీరు మోసపోవచ్చు. భారీగా నష్టపోవచ్చు.

ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. పెళ్లిళ్ల సీజన్ తో సంబంధం లేకుండా డబ్బుంటే చాలు బంగారాన్ని కొంటూనే ఉంటారు. అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా చైన్స్, బ్రాస్ లెట్స్, రింగ్స్ ను కొంటుంటారు. బంగారం కూడా ఒక ఆస్తిలాగే భావించేవారు చాలా మందే ఉన్నారు. అందుకే డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొనిపెడుతుంటారు. తర్వాత అవసరాలకు వాడుకుంటుంటారు. ఇంట్లో కొంత బంగారం ఉంటే ఆర్థికంగా స్థిరంగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. కష్టసమయాల్లో ఇదే మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ విలువైన బంగారాన్ని కొనేటప్పుడు మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే తర్వాత మీరు మోసపోవచ్చు. బంగారం కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

బంగారం స్వచ్ఛత

ఎవ్వరైనా సరే బంగారం కొనేటప్పుడు దాని స్వచ్ఛతను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.  బంగారం 99.9% స్వచ్ఛంగా ఉంటుంది. దీన్ని మనం 24 క్యారెట్ల బంగారం అంటాం. అయితే 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను తయారుచేయలేరు. బంగారు ఆభరణాలను తయారుచేయడానికి బంగారంతో పాటుగా ఇతర లోహాలను కూడా ఉపయోగిస్తారు. బంగారు ఆభరణాలు 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 16 క్యారెట్లు, 14 క్యారెట్లలో దొరుకుతాయి. కానీ మీరు ఎప్పుడూ కూడా 91.6 స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే కొనండి. మిగతా క్యారెట్ల బంగారు ఆభరణాల్లో బంగారం తక్కువగా ఉంటుంది. 
 

Latest Videos


గోల్డ్ క్వాలిటీ

బంగారం కొనేటప్పుడు ఐదు స్టాంపులను ఖచ్చితంగా చెక్ చేయాలి. అంటే మీరు కొనే ఆభరణంపై బీఐఎస్ స్టాంప్, 916 స్వచ్ఛత, హాల్మార్క్ స్టాంప్, జువెలరీ స్టాంప్, తయారు చేసిన సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మీరు కొనే బంగారు ఆభరణంపై ఉంటేనే కొనండి. 
 

రాళ్ల ఆభరణాలు

బంగారు నగలు వివిధ డిజైన్లలో తయారుచేస్తారు. కొన్ని రాళ్లున్న నగలు కూడా ఉంటాయి. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.6,000 ఉంటే, ఒక రాయి ఉన్న చెవిపోగు ఆభరణాల్లో మూడు గ్రాముల బంగారం, ఒక గ్రాము రాయి ఉంటుంది. కానీ మీరు నాలుగు గ్రాముల బంగారం డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3 గ్రాముల బంగారం ధర రూ.18,000 గా ఉన్నా.. కానీ మీరు మొత్తం బరువు కోసం రూ.24,000 చెల్లించాల్సి ఉంటుంది. అందుకే రాళ్లున్న ఆభరణాలను కొనకుండా ఉండటమే బెటర్. 

మోసం..

ఇరవై, ముప్పై ఏండ్ల కిందట చేసిన బంగారాన్ని అమ్మి నష్టపోతున్నవారు చాలా మందే ఉన్నారు. నగల వ్యాపారులు ఇలాంటి నగల్లో బంగారం ఎక్కువగా ఉండదని చెప్పి ఎంతో కొంత చేతిలో పెడుతుంటారు. కానీ ఆభరణాల డిజైన్ ను బట్టి నష్టం 5 శాతానికి పైగా ఉంటుంది. 4 గ్రాముల బంగారం ధరలో 10 శాతం కోల్పోతే అదనంగా రూ.2,400 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించే బంగారు నగలను తయారుచేస్తున్నారు. అయితే మీరు పాత బంగారు ఆభరణాలను అమ్మేటప్పుడు కొలతల్లో మోసం చేసేవారి దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. 
 

మేకింగ్ ఛార్జీలు

డిజైన్లను బట్టి మేకింగ్ ఛార్జీలను భారీగా తీసుకునేవారు చాలా మందే ఉంటారు. గ్రాముకు రూ.200 ఉంటే నాలుగు గ్రాములకు రూ.800 అవుతుంది. ఇది కొన్న బంగారు నగలకు కలుపబడుతుంది.  కాబట్టి మేకింగ్ ఛార్జీలు, డ్యామేజ్ లు లేని ఆభరణాలనే కొనడానికి ప్రయత్నించండి. 
 

అలాగే మీరు మీ పాత నగలను కొత్తవాటిగా మార్పిడి చేసేటప్పుడు, అవి కొన్ని దుకాణంలో మార్పిడి చేయడానికి ప్రయత్నించండి. మీరు కొత్త దుకాణంలో ఆభరణాలను మార్చుకుంటే మీకు ఒక శాతం ఛార్జ్ చేయబడుతుంది. అలాగే రాళ్లు, నగల్లోని మురికిని కరిగించి నగలను తూకం వేయడం వల్ల నష్టాన్ని తెలుసుకోవచ్చు.  

click me!