ఏ పండ్లలో ఎంత చక్కెర ఉంటుందో తెలుసా..?

First Published Aug 17, 2021, 12:53 PM IST

పండ్ల తీపికి కారణం వాటిలోని చక్కెరలే. అయితే, పండ్లలోని చక్కెరతో మామూలు చక్కెరలంత హాని కలుగదు. కాకపోతే, షుగర్ వ్యాధిగ్రస్తులు, చక్కెర తక్కువగా, కేలరీలు లెక్కతో తీసుకునేవారు పండ్లలోని చక్కెర శాతం మీద అంచనా ఉంచుకోవాలి. ఎక్కువ చక్కెరలు ఏ పండ్లలో ఉంటాయి. ఏ పండ్లలో తక్కువ చక్కెరలు ఉంటాయో తెలుసుకుంటే.. మీ కేలరీల అవసరాన్ని బట్టి వాటిని తీసుకోవచ్చు.

సహజమైన శక్తి నిల్వలు పండ్లు. వీటిల్లో పోషకాలు, నీరు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లలో ఉండే సహజ చక్కెర శరీరానికి హానికరం కాదు. చాలా మంచిది. దీనివల్ల పండ్లు తినే విషయంలో ఆందోళన అవసరం లేదు. అయితే డైట్ లో ఉన్నవారు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకుంటున్నవారు.. పండ్లు, వాటిలోని చక్కెరశాతం గురించి తెలుసుకుని ఉండాలి. 

పండ్ల తీపికి కారణం వాటిలోని చక్కెరలే. అయితే, పండ్లలోని చక్కెరతో మామూలు చక్కెరలంత హాని కలుగదు. కాకపోతే, షుగర్ వ్యాధిగ్రస్తులు, చక్కెర తక్కువగా, కేలరీలు లెక్కతో తీసుకునేవారు పండ్లలోని చక్కెర శాతం మీద అంచనా ఉంచుకోవాలి. ఎక్కువ చక్కెరలు ఏ పండ్లలో ఉంటాయి. ఏ పండ్లలో తక్కువ చక్కెరలు ఉంటాయో తెలుసుకుంటే.. మీ కేలరీల అవసరాన్ని బట్టి వాటిని తీసుకోవచ్చు. ఆ పండ్లు, వాటిల్లోని చక్కెరశాతాలు ఒకసారి చూడండి.. 

మామిడి పండ్లు : పండ్లలో రారాజు మామిడి. మధురఫలమైన మామిడి అంటే అందరికీ ఇష్టమే. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు, ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గించాలనుకుంటున్నవారు మామిడి పండ్లను ఎంచుకోకపోవడమే మంచిది. వీలైనంత దూరంగా పెట్టాలి. మీకు మామిడిపండు మరీ అంత ఇష్టం అయితే ఒకటి, రెండు ముక్కలు తినొచ్చు. 

ద్రాక్ష : ఒక కప్పు ద్రాక్షలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే ద్రాక్షపండ్లను రెండు ముక్కలుగా కోసి, ఒక్కో ముక్క నెమ్మదిగా తినడం వల్ల మీరు తినే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. దీనివల్ల తక్కువ చక్కెరలు తీసుకున్నట్టుగా ఉంటుంది. ద్రాక్షలను స్మూతీలు, షేక్స్, వోట్ మీల్స్‌లో వేసుకోవచ్చు.  ద్రాక్షపండ్లను ముక్కలు చేసి డీప్ ఫ్రిజ్ లో కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. 

చెర్రీస్ : ఒక కప్పు చెర్రీస్‌లో దాదాపు 18 గ్రాముల చక్కెర ఉంటుంది. చెర్రీలతో వచ్చిన సమస్య ఏంటంటే.. ఒకటి ఒకటి అలా తింటూనే ఉంటారు. లెక్క తెలియదు. అందుకే చెర్రీలు తినేముందు ఖచ్చితంగా ఎన్ని తినాలనుకుంటున్నారో చూసుకోండి. ఆ తరువాతే తినండి. దీనివల్ల మీరు తీసుకున్న చెర్రీల సంఖ్య, దాంతో వచ్చిన చక్కెరల సంఖ్య తెలుస్తుంది. 

బేరి : ఒక మీడియం సైజు పియర్‌లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు చక్కెరల్ని తీసుకోవడం తగ్గించాలనుకుంటున్నట్లైతే ఒక పియర్ ను మొత్తం తీసుకోవద్దు. సగం తీసుకుంటే సరిపోతుంది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగులో లేదా మీకు ఇష్టమైన సలాడ్ లో కొన్ని ముక్కలు వేసుకుని తినొచ్చు. 

పుచ్చకాయ : ఒక మీడియం సైజు పుచ్చపండు సగం ముక్కలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. వాటర్ మెలన్ పేరుకు తగ్గట్టే పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. దీంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అని పిలువబడే ప్రత్యేక ఖనిజాలను కలిగి ఉంటుంది, అది శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి అవసరం. .

అరటి : అరటిపండ్లు అద్భుతమైన శక్తి కేంద్రాలు. ఒక మీడియం సైజు అరటిపండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మీ బ్రేక్ ఫాస్ట్ లో తృణధాన్యాలతో పాటు అరటిపండు ముక్కల్ని కూడా చేర్చచ్చు. శాండ్ విచ్ లో పీనట్ బటర్ తో పాటు అరటిపండు ముక్కల్ని కలిపి తీసుకోవచ్చు. 

ఇక తక్కువ చక్కెర కలిగిన పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం... 
అవోకాడో : ఒక  అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. మీరు దానిని సలాడ్‌లో తీసుకోవచ్చు. టోస్ట్‌ మీద రుద్దుకోవచ్చు.  లేదా మీ స్మూతీలో ఉపయోగించవచ్చు. కానీ చక్కెర తక్కువగా ఉన్న అవోకాడోలో అధిక కేలరీలు ఉంటాయి. పండ్లన్నింటిలోనూ చక్కెరలూ ఉండవు. అలాంటి వాటిల్లో అవోకాడో ఒకటి.

జామకాయలు : ఒక మీడియం సైజు జామకాయలో 5 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కావాలంటే జామకాయను పొట్టుతోపాటు తినేయాలి. జామకాయలను స్మూతీలు, షేక్‌లకు కలపచ్చు. లేదా విడిగా కూడా తినేయచ్చు. 

కాంతలూప్ (ఖర్బుజా) :  ఖర్బుజా సగం ముక్కలో కేవలం 5 గ్రాముల చక్కెర,  23 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని మరింత టేస్ట్ కోసం కొంచెం కాటేజ్ చీజ్, కొంచెం ఉప్పుతో తినొచ్చు. 

బొప్పాయి : సగం ముక్క బొప్పాయిలో దాదాపు 6 గ్రాముల చక్కెర ఉంటుంది.  బొప్పాయి ముక్కల మీద నిమ్మకాయ, ఉప్పు చల్లుకుని తినొచ్చు. పెరుగుతో కూడా తినొచ్చు. 

కాంతలూప్ (ఖర్బుజా) :  ఖర్బుజా సగం ముక్కలో కేవలం 5 గ్రాముల చక్కెర,  23 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని మరింత టేస్ట్ కోసం కొంచెం కాటేజ్ చీజ్, కొంచెం ఉప్పుతో తినొచ్చు. 

బొప్పాయి : సగం ముక్క బొప్పాయిలో దాదాపు 6 గ్రాముల చక్కెర ఉంటుంది.  బొప్పాయి ముక్కల మీద నిమ్మకాయ, ఉప్పు చల్లుకుని తినొచ్చు. పెరుగుతో కూడా తినొచ్చు. 

click me!