పకోడీలు అమ్మిన వ్యక్తి...దేశంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు..!

First Published Jul 3, 2020, 1:43 PM IST

ఒక మామూలు పాఠశాల అధ్యాపకుని కుమారునిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ, తిరిగి వెళ్ళేనాటికి దాదాపు అరవైఐదు వేలకోట్ల రూపాయల 'రిలయన్స్' మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగారు. ఆయన పడిన కష్టమే..ఉన్నతస్థాయికి చేర్చింది.
 

ముకేష్ అంబానీ, అనీల్ అంబానీ.. ఈ పేర్లు వినగానే.. ఎవరైనా వాళ్లకేంట్రా.. దేశంలోనే అంత్యంత సంపన్నులు అనేస్తారు. అవును.. ప్రస్తుతం వాళ్లు సంపన్నులే. కానీ.. వాళ్లు సంపన్నులుగా మారడానికి వాళ్ల తండ్రి ధీరూ భాయ్ అంబానీ చాలా కష్టాలు పడ్డారు.
undefined
వాళ్ల నాన్న ధీరూబాయ్ అంబానీ ఒకప్పుడు.. పకోడీలు అమ్ముకొని జీవితం సాగించారు... పెట్రోల్ బంక్ లో పని చేసి కడుపు నింపుకున్నారు. ఆయనే తర్వాత దేశంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు.
undefined
జులై 6వ తేదీ ధీరూబాయ్ అంబానీ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
undefined
ఒక మామూలు పాఠశాల అధ్యాపకుని కుమారునిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ, తిరిగి వెళ్ళేనాటికి దాదాపు అరవైఐదు వేలకోట్ల రూపాయల 'రిలయన్స్' మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగారు. ఆయన పడిన కష్టమే..ఉన్నతస్థాయికి చేర్చింది.
undefined
ధీరుబాయి అంబాని అసలు పేరు ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ. ఈయన 1932 డిసెంబర్ 28 న భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రం లో చోర్వాడ్ దగ్గర కుకస్వాడలో నిరాడంబరమైన మోడ్ కుటుంబంలో జన్మించారు.ఈయన తల్లి తండ్రులు హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ , జమ్నాబెన్. బడిపంతులైన వారి తండ్రిగారికి ఈయన రెండవ సంతానం.
undefined
ధీరూభాయ్ అంబానీ.. తన జీవితంలో ఎదిగేందుకు చాలా కష్టాలు పడ్డారు. అత్యంత సులువుగా ఆయన దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా మారలేదు. అందుకు ఎంతో కష్టపడ్డారు. ఒకనొక సమయంలో పకోడీలు కూడా అమ్మారు. పెట్రోల్ బంక్ లో కూడా పనిచేశారు. ఈ విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
undefined
ఆయన, 16 సంవత్సరాల వయసులో యెమెన్ దేశములోనున్న ఎడెన్ కు వెళ్ళారు.A.Besse & Co. లో 300రూపాయల జీతానికి పనిచేసారు. రెండు సంవత్సరాల తర్వాత, A. Besse & Co. షెల్ ఉత్పతులకు పంపిణీదారులయ్యారు, ఎడెన్ రేవు వద్ద ఉన్న కంపెనీ ఫిల్లింగ్ స్టేషన్ కు నిర్వాహకుడిగా ధీరూభాయి ఉద్యోగపు హోదాను పెంచారు.
undefined
ఆయన కోకిలబెన్ ను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కుమారులు, ముకేష్ మరియు అనిల్, మరియు ఇద్దరు కుమార్తెలు, నీతా కొఠారి మరియు రీనా సల్గౌన్కర్.
undefined
1962 లో ధీరుబాయి భారతదేశం తిరిగి వచ్చి రిలయన్స్ మొదలు పెట్టారు.రిలయన్స్ కంపనీ పాలిస్టర్ ను దిగుమతి చేసుకొని, మసాలా దినుసులను ఎగుమతి చేసేది.ఆయన, తనతో పాటు ఎడెన్ యెమెన్ లో ఉన్న రెండవ దాయాది చంపకలాల్ దమాని తో ఉమ్మడి వ్యాపారాన్ని ఆరంభించారు.1965 లో చంపక్ లాల్ దమాని మరియు ధీరుబాయి అంబానీ వారి ఉమ్మడి వ్యాపారాన్ని విరమించి, ధీరూభాయి సొంతంగానే ప్రారంభించారు.
undefined
1968 లో ఇతను దక్షిణ ముంబై లోని ఆల్టామౌంట్ రోడ్డులో ధనికులు నివసించే ప్రాంతములోని అపార్ట్మెంటులో చేరారు. 1970 నాటికి అంబానీ నికర ఆస్తి 10 లక్షలుగా అంచనా.
undefined
ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా.. ఆయన ఉద్యోగుల పట్ల చాలా ప్రేమగా వ్యవహరించేవారు. ఉద్యోగస్థులు అతని గదిలోనికి వెళ్ల గలిగి వారి సమస్యలు అతనితో చర్చించే అవకాశం ఉండేది .
undefined
నేత పరిశ్రమలో మంచి అవకాశాన్ని ఊహించి,ధీరుబాయి నేత మిల్లుని 1977 లో అహ్మదాబాద్ లోని నరోడా లో ఆరంభించారు. ఆ తర్వాత "విమల్ "' అనే బ్రాండ్ ను మొదలుపెట్టారు, అది ఆయన పెద్ద అన్నయ్య కుమారుడు విమల్ అంబానీ పేరు.
undefined
1977వ సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ రంగంలోకి ప్రవేశించిన 'రిలయన్స్' కంపెనీకి నేడు దాదాపు నాలుగు మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు.
undefined
1991వ సంవత్సరంలో 'హజారియా' గ్యాస్ క్రాకర్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో జిడిఆర్ ఇష్యూను జారీ చేయడం ద్వారా ఆ విధంగా చేసిన తొలి భారతీయ కంపెనీగా 'రిలయన్స్' చరిత్ర సృష్టించింది. అంతేకాక రిలయన్స్ కంపెనీ తన సామ్రాజ్యాన్ని వివిధ రంగాల్లోకి విస్తరించడం ప్రారంభించింది.
undefined
1996వ సంవత్సరంలో విద్యుత్ మరియు టెలికాం రంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్ కంపెనీ రూ. 1000- కోట్ల ప్రాఫిట్ స్ధాయినందుకున్న తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. 1997వ సంవత్సరంలో హజీరా ప్లాంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'మల్టీఫీడ్‌ క్రాకర్' ను నెలకొల్పారు. 1999వ సంవత్సరంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 'గ్యాస్‌ రూట్ రిఫైనరీ' ని రిలయన్స్ కంపెనీ ప్రారంభించింది.
undefined
2002వ సంవత్సరం జులై 6వ తేదీన మరోసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో తన 'రిలయన్స్' వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను పూర్తిగా తన కుమారులకప్పగించి ధీరుబాయ్ అంబానీ శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు.
undefined
click me!