'పానిక్ ఎటాక్' అనేది విపరీతమైన ఆందోళన, భయానికి గురయ్యే పరిస్థితి. ఇది కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఇప్పుడే చచ్చిపోతాననే భయం, పిచ్చి పట్టినట్టుగా ఉండటం, నియంత్రణ కోల్పోవడం, శరీరం మొత్తం చెమట పట్టడం, చేతులు, పాదాలు వణకడం, నోరు పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతుగా ఉండటం, ఛాతిలో నొప్పి, మైకము, తలతిరగడం, ఉక్కిరిబిక్కిరి అవడం, కాళ్లు, చేతుల్లో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.