ఈ సీజన్ లో దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.. ఈ టిప్స్ ను పాటిస్తే మీరు సేఫ్..!

First Published Aug 22, 2022, 3:22 PM IST

వర్షకాలంలో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు. ఈ సీజన్ లో ఇది ప్రతి ఒక్కరినీ ఈ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఈ టిప్స్ ను ఫాలో అయితే వీటి నుంచి త్వరగా బయటపడతారు. అలాగే ఇవి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 

వర్షకాలం రాకతో.. చల్లని చిరుజల్లులు ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. ఇక సీజన్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం లాగ ఈ సీజన్ లో దారుణమైన ఎండలు కొట్టవు. ఎప్పుడు చూసినా చల్లగానే ఉంటుంది. కానీ ఈ సీజన్ లోనే రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రతిఒక్కరినీ చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే మారుతున్న ఈ వాతావరణంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ కు గురికాకతప్పదు. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా చుట్టుకుంటాయి. అయితే ఈ సమస్యలను ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కొబ్బరి నూనె

సాధారణంగా మనమందరం కొబ్బరి నూనెను జుట్టుకే ఉపయోగిస్తాం.. కానీ దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ కొబ్బరి నూనెను వంటలకు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ నూనెతో వంటలను చేసుకుని తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

గోరు వెచ్చని నీళ్లు

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో రకాల వ్యాధులు, అంటువ్యాధులు  కూడా ఎక్కువుగా చుట్టుకుంటాయి. ఇలాంటి సమయంలో మీరు చల్లని నీటికి బదులుగా.. గోరువెచ్చని నీటిని తాగండి. ఈ వాటర్ సంక్రమణ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. గోరువెచ్చని నీరు ఇమ్యూనిటీని పెంచడమే కాదు.. జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. 
 

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని కూరల్లో వేయడం వల్ల వంటలు ఎంతో రుచిగా అవుతాయి. దీన్ని టీలో కూడా వేస్తుంటారు. దీనిలో పుష్కలంగా జింజెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ అల్లం జలుబును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  ఇందుకోసం అల్లాన్ని పచ్చిగా తినొచ్చు. లేదా గ్రైండ్ చేసి రసాన్ని కూడా తాగినా జలుబు తొందరగా తగ్గిపోతుంది.  ఇంకొంతమంది అల్లం ఉసిరిని మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా దగ్గు, జలుబును తగ్గించడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 
 

గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా దగ్గు, జలుబును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఆమ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య  సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలో క్యాటెచీన్స్ కూడా ఉంటాయి. ఇవి జలుబును తొందరగా తగ్గిస్తాయి. జలుబు చేసిన వారు గ్రీన్ టీ తాగితే.. ఆరోగ్యం బాగుంటుంది. 
 

ఆరెంజ్

ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా  ఉంటుంది. ఈ పండు జలుబును తగ్గించడంతో పాటుగా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ పండును తినడం వల్ల తెల్ల రక్తకణాల ఉత్పత్తి  కూడా పెరుగుతుంది.
 

click me!