పవన్ భార్య అన్నా లెజినోవాది అంత చిన్న వయసా... వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు!

Published : May 03, 2024, 05:01 PM ISTUpdated : May 03, 2024, 05:52 PM IST

పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజినోవా ల వయసుకు సంబంధించిన మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ స్టార్ కపుల్ మధ్య ఏజ్ గ్యాప్ చర్చకు దారి తీసింది. ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీకోసం...   

PREV
16
పవన్ భార్య అన్నా లెజినోవాది అంత చిన్న వయసా... వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు!

పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. నటుడిగా హైట్స్ చూసిన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయి. ఆయన మూడు వివాహాలు చేసుకోవడాన్ని ప్రత్యర్థులు తప్పుబడతారు. ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్న నేపథ్యంలో దీన్ని ఒక లోపంగా చూస్తారు.

26

మొదట పవన్ కళ్యాణ్ వైజాగ్ కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు ఇచ్చారు. బద్రి మూవీలో తనతో జతకట్టిన రేణు దేశాయ్ ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి అకీరా, ఆద్య సంతానం. 2012లో రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చాడు.

36
Pawan Kalyan

మూడో వివాహంగా రష్యన్ నటి అన్నా లెజినోవాను చేసుకున్నారు. తీన్ మార్ చిత్రంలో అన్నా లెజినోవా నటించింది. ఆ మూవీ సెట్స్ లో అన్నా తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది . 2013లో అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానంగా ఉన్నారు.

46

కాగా అన్నా-పవన్ కళ్యాణ్ మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. వీరిద్దరి వయసు ఎంత? వ్యత్యాసం ఎంత? అని పరిశీలిస్తే... పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న జన్మించాడు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఇక అన్నా విషయానికి వస్తే... అం 1980లో పుట్టినట్లు సమాచారం. ఆమె వయసు 44 సంవత్సరాలు. దాదాపు 11 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కంటే ఆయన భార్య చిన్నది. 
 

56
Pawan Kalyan


చిత్ర పరిశ్రమలో ఏజ్ గ్యాప్ పెళ్లిళ్లు సాధారణమే. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్, రన్బీర్ కపూర్-అలియా భట్ మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కాగా ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ని వివాహం చేసుకుంది. 
 

66


ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే... హరి హర వీరమల్లు చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ తప్పుకోగా జ్యోతి కృష్ణ రంగంలోకి దిగాడు. అలాగే ఎన్నికల అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories