ఈ ఫుడ్స్ తింటే... పిల్లల బ్రెయిన్ కంప్యూటర్ లా పని చేస్తది..!

First Published | May 3, 2024, 4:50 PM IST

పిల్లలలు కూడా అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు అన్నీ తినరు. అయితే.. కనీసం ఈ కింది ఫుడ్స్ అయినా తినిపించాల్సిందే. ఈ కింది పుడ్స్ కనుక తింటే.. మీ పిల్లల బుర్ర కంప్యూటర్ లాగా ఫాస్ట్ గా పని చేస్తుంది. 

foods for kids

తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా పని చేయాలని, వాళ్లకు అన్ని విషయాలు అర్థం కావాలని, చదువు బాగా రావాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే పిల్లల బ్రెయిన్ అలా ఉండాలి అంటే వాళ్లు మంచి ఆహారం తీసకుకోవాలి. కానీ... పిల్లలలు కూడా అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు అన్నీ తినరు. అయితే.. కనీసం ఈ కింది ఫుడ్స్ అయినా తినిపించాల్సిందే. ఈ కింది పుడ్స్ కనుక తింటే.. మీ పిల్లల బుర్ర కంప్యూటర్ లాగా ఫాస్ట్ గా పని చేస్తుంది. మరి ఏమేమి తినిపించాలో ఓసారి చూద్దాం...

Omega-3 fatty acid


1.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్...
పిల్లల ఆహారంలో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాళ్లకు అందేలా చేయాలి. చేపలు, వాల్ నట్స్, చియా సీడ్స్ వంటి వాటిలో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.



2.కోడి గుడ్డు..
ఏదో ఒక రూపంలో పిల్లలకు కచ్చితంగా రోజూ గుడ్డు తినిపించాలి. ఎందుకంటే .. కోడిగుడ్డు పచ్చసొనలో కోలిన్ ఉంటుంది, ఇది పిల్లల జ్ఞాపకశక్తికి మంచిది. గుడ్లలో ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
 


కార్బోహైడ్రేట్లు
పిల్లలకు తక్షణ శక్తిని అందించడంలో కార్బో హైడ్రేట్స్ సహాయం చేస్తాయి.  వోట్స్, బ్రౌన్ రైస్ , హోల్ గ్రెయిన్ బ్రెడ్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి, కాబట్టి పిల్లలు చాలా కాలం పాటు శక్తిని పొందుతారు. ఇది వారిని రోజంతా చురుకుగా , ఉత్సాహంగా ఉండటానికి సహాయపడతాయి.


బెర్రీలు
స్ట్రాబెర్రీలు , ఇతర బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు చాలా ఉన్నాయి, ఇవి మన మెదడుకు చాలా మేలు చేస్తాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. వీటిని తింటే మనసు చురుగ్గా, చురుగ్గా తయారవుతుంది.

ఆకుపచ్చ కూరగాయలు , గింజలు
నట్స్, బచ్చలికూర, బ్రోకలీ  ఇతర ఆకుపచ్చ కూరగాయలలో ఐరన్, విటమిన్లు A,K పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయలు పిల్లల  మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా , బాగా పని చేస్తుంది. ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి... పిల్లల డైట్ లో ఈ ఫుడ్ ఉండేలా చూసుకుంటే... కచ్చితంగా వాళ్లు అన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు.

Latest Videos

click me!