బరువు తగ్గిన తర్వాత జుట్టు రాలిపోతోందా? జుట్టు పెరగాలంటే ఇలా చేయండి

First Published Jan 28, 2023, 10:00 AM IST

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హెయిర్ ఫాల్. ముఖ్యంగా వెయిట్ లాస్ అయిన తర్వాత.  ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు. అయితే బరువు తగ్గిన తర్వాత జుట్టు రాలడానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. 

ప్రతిరోజూ ప్రయత్నిస్తే నిదానంగానైనా బరువు తగ్గుతారు. తొందరగా బరువు తగ్గాలని కేలరీలను మరీ ఎక్కువగా తగ్గిస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అయితే బరువు తగ్గిన తర్వాత ఎక్కువ  మంది ఫేస్ చేసే సమస్య హెయిర్ ఫాల్. అవును బరువు తగ్గిన తర్వాత చాలా మంది జుట్టు ఊడిపోతుందని చెప్తుంటారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. బరువు తగ్గే ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన పోషకాలను తీసుకోవడం మానేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఆ పోషకాల లోపం ఏర్పడుతుంది. ఫలితంగా మీ ఆరోగ్యం, చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఈ పోషకాల లోపం వల్లే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రకంగా జుట్టు రాలిపోవడాన్ని టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. అయితే ఈ సమస్య తాత్కాలికమైందే. అంటే  ఇది నాలుగు నెలల పాటు ఉండొచ్చు. 
 

hair fall

జుట్టు రాలడానికి కారణాలు

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం సర్వ సాధారణం, దీన్ని హెయిర్ షెడ్డింగ్ అంటారు. అయితే రోజుకు వందకంటే ఎక్కువ రాలిపోతే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే పోషకార లోపంతోనే ఇలా జుట్టురాలిపోతుంది. 

hair fall

పోషకాహార లోపం జుట్టు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తొందరగా బరువు తగ్గాలని చాలా తక్కువగా తింటుంటారు. ముఖ్యంగా అన్నం, రొట్టెలు, నెయ్యి, అరటి, బంగాళాదుంపలను పూర్తిగా తినడం మానేస్తుంటారు. అది కూడా డైటీషియన్ ను సంప్రదించకుండా. కానీ వీటిని తీసుకోకపోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇదికాస్త జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 
 

అడపాదడపా ఉపవాసం, డీటాక్స్, కీటో డైట్ వంటి ఫాడ్ డైట్స్ ను ఫాలో అయ్యే వారు ఆహారాన్ని, కేలరీలను తీసుకోవడం అకస్మత్తుగా పరిమితం చేస్తారు. దీనివల్ల  వారి శరీరానికి కావాల్సిన సూక్ష్మ, స్థూల పోషకాలు అందవు. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

జర్నల్ డెర్మటాలజీ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్చువల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. పోషకాహార లోపం మన శరీరంలోని అమైనో ఆమ్లం కంటెంట్ ను ప్రభావితం చేస్తుంది. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ కు బిల్డింగ్ బ్లాక్స్. ఇవి జుట్టు పెరిగేందుకు కెరాటిన్ ఉత్పత్తికి చాలా చాలా అవసరం. అయితే మీరు ప్రోటీన్ ఎక్కువగా లేని తక్కువ కేలరీలున్న ఆహారాలను బరువు తగ్గడానికని తిన్నప్పుడు జుట్టు రాలిపోతుంది. 

బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకునేటప్పుడు జుట్టు పెరగాలంటే ఏం చేయాలి? 

హైడ్రేట్ గా ఉండండి

శరీరం నుంచి విషాన్ని బయటకు  పంపాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. నీటితో ఎన్నో సమస్యలు నయమవుతాయి. నీరు కూడా బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీరు జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

protein rich foods

ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోండి

మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ప్రోటీన్ ఫుడ్ మీ బరువును తగ్గించడమే కాదు.. జుట్టు జుట్టు మూలాలలో కెరాటిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతంది. హెయిర్ ఫాల్ సమస్యే ఉండదు. 

సీజనల్ పండ్లు,  కూరగాయలు తినండి

ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆకు కూరలను, సీజనల్ పండ్లను ఖచ్చితంగా తినాలంటుంటారు. ఆకుకూరలు, కాలానుగుణంగా పెరిగే ఉత్పత్తులు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

త్వరగా బరువు తగ్గడం మానుకోండి

బరువు తగ్గడానికి సమయం, సహనం, అంకితభావం చాలా అవసరం. ఇవి ఉంటేనే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలా కాకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జుట్టు బాగా రాలుతుంది. క్రమంగా బరువు తగ్గడానికి మీరు తినే ఆహారాలు అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

junk food

జంక్ ఫుడ్ మానుకోండి

కేలరీలు, నూనె, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే ప్రాణాంతకంగా మారుతుంది. తరచుగా లేదా ఎక్కువ మొత్తంలో వీటిని తింటే పోషక లోపాలకు దారితీస్తుంది. ఇది జుట్టు రాలడానికి, బరువు పెరగడానికి దారితీస్తుంది.

click me!