పిల్లలకు ఈత నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..!

First Published | Apr 28, 2024, 4:31 PM IST

ఎండాకాలం వస్తే చాలు ఈతకు రెగ్యులర్ గా వెళ్తుంటారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు స్విమ్మింగ్ నేర్పిస్తుంటారు. అయితే పిల్లలకు ఈత నేర్పేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.  
 

ఎండాకాలం వచ్చేసింది. ఇంకేముంది పిల్లలకు కూడా స్కూళ్లు లేకపోవడంతో పేరెంట్స్ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించే పనిలో బిజీగా ఉంటారు. అయితే పిల్లలకు ఈత నేర్పేటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని సింపుల్ చిట్కాలతో పిల్లలకు చాలా తొందరగా ఈత నేర్పించొచ్చు. పిల్లలకు ఈత నేర్పేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

స్విమ్మింగ్ కిట్ 

చిన్న పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు వారికి ఖచ్చితంగా స్విమ్మింగ్ కిట్ కొనాలి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్, స్విమ్మింగ్ గ్లాసెస్, ఇతర సేఫ్టీ ఐటమ్స్ కూడా పిల్లలకు ఖచ్చితంగా కొనాలి.  దీంతో పిల్లలు ఈత కొడితే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Latest Videos


లైఫ్ జాకెట్లు 

చిన్న పిల్లలకు ఈత నేర్పించేటప్పుడు వారికి లైఫ్ జాకెట్లను కొనివ్వాలి. ఈత నేర్చుకునేవారికి లైఫ్ జాకెట్లు చాలా చాలా ముఖ్యం. లైఫ్ జాకెట్ల సహాయంతో పిల్లలకు రిస్క్ తగ్గుతుంది. వారు సేఫ్ గా ఉంటారు. ఈత నేర్చుకునేటప్పుడు మొదట్లో వారికి ఖచ్చితంగా లైఫ్ జాకెట్లను వేయండి. ఈ తర్వాతే వారిని ఈత కొట్టమని చెప్పండి. 

Parenting

ట్యూబ్

మీ పిల్లలు మరీ చిన్నగా ఉంటే వారికి ట్యూబులను కొనండి. ఎందుకంటే వీటి సహాయంతో మీ పిల్లలు నీళ్లలో మునిగిపోరు. అందుకే మీ పిల్లలు మరీ చిన్నగా ఉంటే ఖచ్చితంగా వీటిని కొనండి. మీకు తెలుసా? వీటి సహాయంతో మీ పిల్లలు సొంతంగా ఈత నేర్చుకుంటారు. 

పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఎప్పుడైనా సరే మీ పిల్లలను ఒంటరిగా ఈత కొట్టనివ్వకండి. ఈత కొట్టేటప్పుడు మీరు వారి పక్కనే ఉండండి. 

పిల్లల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

స్విమ్మింగ్ పూల్స్ నియమాల గురించి మీ పిల్లలకు వివరించండి. 

నీళ్లు మింగకూడదని చెప్పాలి.

స్టార్టింగ్ లోనే అండర్ వాటర్ స్విమ్మింగ్ చేయొద్దని చెప్పండి.
 

click me!