విశాల్ కే షాకిచ్చిలా... రత్నం కలెక్షన్స్ ,ఇంత దారుణమా!

By Surya PrakashFirst Published Apr 28, 2024, 4:10 PM IST
Highlights

సింగమ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడు హరి డైరెక్షన్ లో వచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. ఎన్నో ఎక్సపెక్టే,న్స్ తో పెట్టుకుని చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. 


విశాల్ సినిమాలు గత కొన్నేళ్ళుగా  ఏమీ ఆడటం లేదు . అయినా ఆపకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా మొత్తానికి మొన్నీ మధ్య  అనుకోకుండా మార్క్ అంథోని(mark antony)తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా తో 102 కోట్ల వసూల్లను అందుకున్న విశాల్(Vishaal) ఉత్సాహంగా నటించిన కొత్త సినిమా రత్నం(Rathnam Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సింగమ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన తమిళ దర్శకుడు హరి డైరెక్షన్ లో వచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. ఎన్నో ఎక్సపెక్టే,న్స్ తో పెట్టుకుని చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. 

ఈ సినిమా ఓపినింగ్ రోజు  కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయింది.  ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 3.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా ఆ మాత్రం కూడా హోల్డ్ ని చూపించ లేక పోయింది. తమిళ్ లో 2 కోట్ల రేంజ్ లో తెలుగు లో 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమె అందుకుంది.
 
టోటల్ గా రెండు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో  1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. తమిళ్ లో 4.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోవడంతో… టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 6.6 కోట్ల రేంజ్ లో ఉండగా వర్త్ షేర్ 3 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

తెలుగు లో సినిమా హిట్ అనిపించుకోవాలి  అంటే మినిమం 4.5 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.  ఆదివారం కూడా ఎక్కడా కలెక్షన్స్ పికప్ కాకపోవటంతో  రత్నం మూవీ తేరుకునే అవకాశం లేనట్లే. 

విశాల్ (Vishal) , డైరెక్టర్ హరి  (Hari) కాంబినేషన్లో ‘భరణి’ ‘పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మూడో చిత్రంగా ‘రత్నం'(తమిళ్ లో ‘రత్తం’) (Rathnam) రూపొందింది. ‘భరణి’ ‘పూజా’ చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అందుకే ‘రత్నం’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘జీ స్టూడియోస్‌’తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించింది.
 

click me!