ఆ కోరికతో దగ్గరకు వెళితే అనసూయ ఎలా డీల్ చేస్తుందో తెలుసా?... క్యాస్టింగ్ కౌచ్ పై రంగమ్మత్త షాకింగ్ కామెంట్స్!

Published : Apr 28, 2024, 04:39 PM IST

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదనేది నిజం. పలువురు నటీమణులు తమకు ఎదురైన అనుభవాలు షేర్ చేశారు. తాజాగా అనసూయ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.   

PREV
16
ఆ కోరికతో దగ్గరకు వెళితే అనసూయ ఎలా డీల్ చేస్తుందో తెలుసా?... క్యాస్టింగ్ కౌచ్ పై రంగమ్మత్త షాకింగ్ కామెంట్స్!
Anasuya Bharadwaj

పరిశ్రమ ఏదైనా ఆడవాళ్లకు లైంగిక వేధింపులు తప్పవు. చిత్ర పరిశ్రమలో ఈ కల్చర్ ఇంకొంచెం ఎక్కువ. ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ వరకు ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే. 

26

హాలీవుడ్ లో దీనిపై పెద్ద ఉద్యమమే జరిగింది. మీటూ పేరున సాగిన ఉద్యమంలో పలువురు హీరోయిన్స్ తనకు ఎదురైన చేదు అనుభవాలు వెల్లడించారు. దర్శక నిర్మాతలు, హీరోల మీద ఆరోపణలు చేశారు. ఇండియాలో కూడా తనుశ్రీ దత్తా, శ్రీరెడ్డి, చిన్మయి లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు చేశారు. 

 

36
Anasuya Bharadwaj

తాజాగా అనసూయ స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైనప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తారో వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ... ఒక సినిమా గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఎదుటి వారి ఉద్దేశం మనకు మొదటి మూడు నిమిషాల్లోనే అర్థం అవుతుంది. 

46

మన నుండి ఆశిస్తున్నారు తెలిసినప్పుడు నేను నా ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ గురించి మాట్లాడతాను. అప్పుడు వ్ వాళ్ళు ఆ టాపిక్ తీసుకురారు. మనం ఈ పరిశ్రమలో ఉండాలి. జర్నీ సాగించాలి. కాబట్టి ఎవరితో వివాదాలు పెట్టుకోకూడదు. లౌక్యంగా మాట్లాడి తప్పుకున్నప్పుడు, భవిష్యత్ లో వారు ఎదురైనా కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాదు... అని అనసూయ అన్నారు. 
 

 

56
anasuya instagram

ఈ కమిట్మెంట్స్ విషయంలో కర్ర విరగకూడదు పాము చావకూడదు... అన్నట్లు వ్యవహరించాలని అనసూయ చెప్పుకొచ్చారు. అనసూయ స్వభావానికి ఈ మాటలు చాలా విరుద్ధమైనవి. ఆమె ఫైర్ బ్రాండ్ లా ఉంటారు. ఆఫర్స్ ఎర చూపి కమిట్మెంట్ అడిగేవాళ్ళ నుండి తెలియవిగా తప్పుకోవాలని అనసూయ పరోక్షంగా చెప్పుకొచ్చారు. గొడవలు పడటం సరికాదని ఆమె మాటల ద్వారా అర్థం అవుతుంది. 

 

66

యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ పూర్తి స్థాయి నటిగా మారిన విషయం తెలిసిందే. పుష్ప 2తో పాటు పలు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఇతర భాషల్లో కూడా అనసూయకు ఆఫర్స్ రావడం విశేషం... 

Read more Photos on
click me!

Recommended Stories