సోనూసూద్ వాట్సప్ 61 గంటలు పాటు Block, ఎన్ని మెసేజ్ లు వచ్చాయో తెలిస్తే మతి పోతుంది

First Published Apr 28, 2024, 4:39 PM IST

 కరోనా సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఎందరో అభాగ్యులు ఆకలితో అలమటించారు. స్నేహితులతో కలిసి ఎంతో మంది ఆకలి తీర్చడంతోపాటు కాలినడకన వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్న వారిని బస్సుల్లో సొంత ఊర్లకు చేర్చాడు.


కష్టాల్లో  ఉన్న వారికి నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ (Sonu Sood) త‌న దాతృత్వ కార్య‌క్ర‌మాల‌తో ఎనలేని గుర్తింపు పొందారు. ప్ర‌జ‌ల‌కు సాయం అందించే ఎన్నో ఫొటోలు, పోస్టులు, వీడియోల‌ను త‌ర‌చూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాగే ఆయన్ను నిరంతరం జనం..సాయిం కోసం క్షణం ఆపకుండా మెసేజ్ ల రూపంలో సాయం కోరుతూనే ఉంటారు. అలాంటి సోనూ సూద్ ..వాట్సప్ 61 గంటలు పాటు బ్లాక్ అయితే పరిస్దితి ఏమిటి..ఎన్ని మెసేజ్ లు వచ్చి ఉంటాయి.


  సోనూ సూద్, తన మెసేజింగ్ యాప్‌ వాట్సప్  గంటల తరబడి బ్లాక్ అయిన తర్వాత ఎట్టకేలకు తన వాట్సాప్ యాక్సెస్‌ను తిరిగి పొందాడు.బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ అందరికీ సుపరిచితమే. ఆయన కరోనాలో ఎంతో మంది కూలీ పనులు చేసుకుంటున్న పేదవారికి సహాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు చేస్తూ మరో ప్రక్క  పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి సహాయం గా ఉంటూ వస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎంతోమందికి అత్యవసరమైన  ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు.
 


ఇదిలా ఉంటే.. తాజాగా, సోనూసూద్ వాట్సాప్ ఆగిపోయిందని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా పలు పోస్టులు షేర్ చేశాడు. తన వాట్సాప్ ఏకంగా 36  గంటల పాటు పనిచేయడం లేదని కష్టాల్లో ఉన్నవారంతా తనను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతారని వారంతా ఇబ్బంది పడతారని సమస్యను పరిష్కరించాలని రాసుకొచ్చాడు. 
 


అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో వాట్సాప్ వేకప్.. అర్జెంట్‌గా అకౌంట్ బ్లాక్ అయింది. తొందరగా స్పందించి సమస్యను తీర్చండి అని మరో పోస్ట్ పెట్టాడు. ఇక వాట్సాప్ వారు స్పందించడంతో ఆయన మళ్లీ తన అకౌంట్ పనిచేస్తుందని తెలిపాడు. అంతేకాకుండా 6 గంటల్లోనే 1000 మేసేజ్‌లు వచ్చాయని  చెప్పాడు.


 వాట్సాప్ ఖాతా దాదాపు 60 గంటల పాటు బ్లాక్ చేయబడిన తర్వాత మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు విజ్ఞప్తి చేశాడు. సహాయం కోసం అవసరమైన వ్యక్తులు అతనిని సంప్రదించడంతో నటుడు బాధతో విజ్ఞప్తులు చేసాడు. ఆదివారం, సోనూ తన ఖాతా స్థితి గురించి తన 27.7 మిలియన్ల ఫాలోవర్లను మరోసారి అప్‌డేట్ చేశాడు. 61 గంటల వ్యవధిలో తనకు 9,000కు పైగా చదవని సందేశాలు ఉన్నాయని సోనూ షేర్ చేసుకున్నాడు. 
 


  సాటి వారు కష్టాల్లో ఉంటే నేనున్నాననే భరోసాను కల్పించాడు సోనూ సూద్. కలియుగ కర్ణుడిగా ఘన కీర్తి పొందాడు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను సొంత డబ్బుతో బస్సులు ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపడం అతనికే చెల్లింది. కూతుర్లను కాడెద్దులుగా చేసి పొలం దున్నుతున్న ఓ కష్టజీవి అయిన రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి ఆ అన్నదాతకు ఆసరాగా నిలిచి ఆదర్శంగా నిలిచిన గొప్ప మనసు అతనిది.
 


 సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి హీరోల చేతుల్లో దెబ్బలు తినే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకుని రీల్ హీరోలకు ఆదర్శంగా నిలిచాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఇప్పుడు అతనో సెలబ్రెటీ. అతనికే దక్కింది ఎవరికీ దక్కని పాపులారిటీ. కరోనా ఫస్ట్ వేవ్‌లో మాత్రమే కాదు సెకండ్ వేవ్‌లోనూ దేశ ప్రజల బాగోగుల కోసం అతను చూపించిన చొరవ నిజంగా ప్రశంనీయం. 


ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తరుణంలో సొంత డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాడు. రాజకీయ నేతలు, క్రికెటర్లు కూడా అతని సాయం కోసం చేయి చాచిన వారిలో ఉన్నారంటే ఎంతలా అతను అందరి దృష్టిని ఆకర్షించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ‘బతుకు జీవుడా’ అని ఎదురుచూస్తున్న చాలామందికి ప్రాణవాయువును అందించి వారి ప్రాణాలను నిలిపాడు.  

Sonu Sood

 
సినిమాల్లో నటించి..కోట్లు సంపాదించినా రాని ఆనందం పేదలకు సేవ చేస్తేనే వస్తున్నదని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ అన్నారు. ఏదైనా సమస్య వస్తే ప్రజలు తనకు ఫోన్‌ చేయాలని, సాయం చేస్తానని చెప్పారు  సోనూసూద్‌ మాట్లాడుతూ తనకు బాలీవుడ్‌ కంటే తెలుగు సినిమాలతోనే మంచి పేరు వచ్చిందన్నారు.


కరోనా సమయంలో ప్రజలకు వచ్చిన ఇబ్బందులను చూసి చలించిపోయి.. సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు.   ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన వస్తువులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
 


స‌మాజ‌సేవ అనేది త‌మ ర‌క్తంలోనే ఉన్న‌ద‌ని బాలీవుడ్ న‌టుడు, ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త సోనూసూద్ చెప్పారు. త‌న త‌ల్లి ఒక ప్రొఫెస‌ర్ అని, పిల్ల‌ల‌కు త‌న జీవిత పాఠాల‌న్నీ నేర్పార‌ని అన్నారు. అదేవిధంగా త‌న తండ్రి ఒక సామాజిక కార్య‌క‌ర్త అని, మోగాలో చాలా పాఠ‌శాల‌లు, కాలేజీలు, ధ‌ర్మ‌స‌త్రాలు త‌మ భూముల్లోని ఫ్లాట్‌లోనే నిర్మించ‌బడ్డాయ‌ని ఆయ‌న చెప్పారు. అందుకే సామాజిక సేవ అనేది త‌మ ర‌క్తంలోనే ఉంద‌ని చెబుతున్నాన‌ని పేర్కొన్నారు.

Sonu Sood


త‌న సోద‌రి కూడా పంజాబ్‌లోని మోగా సిటీలో ఎన్నో సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని సోనూసూద్ చెప్పారు. మోగాలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చాలావ‌ర‌కు పూర్తికావ‌డానికి త‌మ సోద‌రి మాళ్విక‌నే కార‌ణ‌మ‌న్నారు. మోగాలో నిర‌క్ష‌రాస‌త్య‌, పేదిరికం అనేవి ప్ర‌ధాన స‌మ‌స్య‌లుగా ఉన్నాయ‌ని, ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌న సోద‌రి ఎంతోకాలంగా పోరాడుతున్నార‌ని సూద్ తెలిపారు.


సోషల్ మీడియాలోనూ 'సాయం కావాలి..' అంటూ ట్వీట్‌ చేస్తే రెక్కలు కట్టుకుని మరీ వెళ్లి నేనున్నానంటూ సాయపడే సోనూ విశాల హృదయం ముందు ఆకాశం కూడా చిన్నదే. ఈ సాయం చేసే గుణమే నటుడిగా కొందరికే తెలిసిన సోనూసూద్‌ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోతోంది.

click me!