డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా?

First Published Sep 21, 2021, 4:49 PM IST

డైలమాలో ఉన్నప్పుడు.. డ్రై ఫ్రూట్స్ తినడం.. మంచిదేనా? అనే ప్రశ్నా ఉదయిస్తుంది. అయితే, డయాబెటిక్ ఒక రోజులో ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు? అనేది ఇంకో ప్రశ్ర... దీనికి నిపుణులు చెప్పే పరిష్కారం ఏంటో తెలుసా?.

dry fruits

భోజనానికి ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని జోడించడానికి, తినాలనే క్రేవింగ్ ను తీర్చడానికి చక్కటి ఆప్షన్ డ్రై ఫ్రూట్స్ తినడం.. అయితే, మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, ఇన్సులిన్ అసమతుల్యతతో బాధపడుతున్న చాలామందికి 'ఏమి తినాలి? ఏది తినకూడదు?' అనేది చాలా ముఖ్యమైన ప్రశ్నగా మిగిలిపోతుంది. 

అలాంటి డైలమాలో ఉన్నప్పుడు.. డ్రై ఫ్రూట్స్ తినడం.. మంచిదేనా? అనే ప్రశ్నా ఉదయిస్తుంది. అయితే, డయాబెటిక్ ఒక రోజులో ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినవచ్చు? అనేది ఇంకో ప్రశ్ర... దీనికి నిపుణులు చెప్పే పరిష్కారం ఏంటో తెలుసా?.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు డ్రై ఫ్రూట్స్ మంచివేనా?
పండ్లను ఎండబెట్టడం ద్వారా డ్రై ఫ్రూట్స్ తయారవుతాయి. వీటిల్లో పోషకాలు చాలా ఉంటాయి. అందువల్ల, తాజా పండ్లతో పోలిస్తే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్‌లతో పాటు సహజ ఫ్రక్టోజ్ సాంద్రత డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది నిపుణులు డ్రై ఫ్రూట్స్‌ని మితంగా తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు మంచి పోషకాహారం పొందొచ్చు అని.. తినాలనే తీపి కోరికలను కంట్రోల్ లో పెట్టడంతో సహాయపడొచ్చని చెబుతున్నారు. ఇంకొంతమంది డయాబెటిస్ ఉన్నవారికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న తాజా పండ్లు ఉత్తమమని చెబుతారు. 

ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో చక్కెర సాంద్రత ఎక్కువగా ఉన్నందున,  కేవలం 2-3 డ్రై ఫ్రూట్స్  మాత్రమే డయాబెటిక్ పేషంట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అత్తి పండ్ల వంటి చక్కెర అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే అవి కొంచెం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు.

మరి డయాబెటిస్‌ ఉన్నవారు ఏ డ్రై ఫ్రూట్స్ తినొచ్చు?
డ్రై ఫ్రూట్స్‌లో సాంద్రీకృత ఫ్రక్టోజ్ అధికంగా ఉన్నప్పటికీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ చక్కెర స్థాయిలను తక్షణం పెంచకుండా.. మీ తీపి కోరికలను తీర్చడంలో సహాయపడతాయి. మెడ్ ఇండియా మెడికల్ రివ్యూలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఎండు ఖర్జూరాలు, నేరేడు పండు, సుల్తానా, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అందుకే వాటిని మితంగా తినవచ్చు.

వాస్తవానికి, ఈ డ్రై ఫ్రూట్స్‌లో వైట్ బ్రెడ్ తో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. కాబట్టి, మీరు మీ క్రేవింగ్స్ తీరాలని అనుకుంటే..  రోజుకి 2-3 డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అయితే, మీ ఆహారంలో వీటిని చేర్చేముందు తప్పనిసరి ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించాలి. 

click me!