పిల్లలతో తండ్రి ఎలా ఉండాలి..?

First Published Apr 30, 2024, 10:00 AM IST

నిజానికి పిల్లల విషయంలో తండ్రే ఎక్కువగా ఓపికగా ఉండాలి. పిల్లలు తప్పు చేసినా, కరెక్ట్ చేయకపోయినా.. కోపం చూపించకుండా.. వారి తప్పులు అర్థమయ్యేలా ఓపికగా వివరించాలి. అల్లరి చేసినా భరించేలా ఉండాలి.

తల్లిగా మారడం ఒక స్త్రీ జీవితంలో గొప్ప అనుభూతిని ఇస్తుంది. జీవితాన్నే మార్చేస్తుంది. అయితే.. తల్లి జీవితమే కాదు.. తండ్రి జీవితం కూడా మారిపోతుంది. చాలా మంది తండ్రులు.. తమకు తమ బిడ్డలపై ప్రేమ ఉన్నా.. ఆ ప్రేమను బయటకు చూపించరు. ముఖ్యంగా  మగ పిల్లలతో అయితే అసలే ప్రేమ చూపించరు. లోపల ఎంత ప్రేమ ఉన్నా.. దానిని చూపిస్తే.. పిల్లలు పాడౌతారేమో, గారాభం కిందకు వస్తుందేమో అని అనుకుంటారు. కానీ.. అసలైన తండ్రి అనేవాడు ఎలా ఉండాలి..? పిల్లలతో ఎలా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
 

1. తండ్రి ప్రేమ పిల్లలపై అన్ కండిషనల్ గా ఉండాలి.  ఈ సమయంలో ఇంతే ప్రేమ చూపించాలి.. ఇంత కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తే.. పాడైపోతారు అనే కొలమానాలు పెట్టుకోకూడదు. వారి పై చూపించే ప్రేమ అన్ కండిషనల్ గా ఉండాలి. పిల్లల్లో ఉండే తప్పులను కూడా తండ్రి యాక్సెప్ట్ చేసి.. ప్రేమను చూపించాలి.
 

2.తండ్రి కోపంగా ఉండాలి.. తల్లి ఓపిక గా ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజానికి పిల్లల విషయంలో తండ్రే ఎక్కువగా ఓపికగా ఉండాలి. పిల్లలు తప్పు చేసినా, కరెక్ట్ చేయకపోయినా.. కోపం చూపించకుండా.. వారి తప్పులు అర్థమయ్యేలా ఓపికగా వివరించాలి. అల్లరి చేసినా భరించేలా ఉండాలి.
 

3.చాలా మంది తండ్రులు.. పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే.. చిన్న విజయానికే పొగిడితే పాడైపోతారేమో అనుకుంటారు. కానీ.. పిల్లల చిన్న విజయాన్ని కూడా తండ్రి గొప్పగా చూడాలి. వారిని మరింత గా ప్రోత్సహించాలి. మెచ్చుకోవాలి. తండ్రి ప్రోత్సాహం, ప్రశంసలు.. పిల్లలను మరింత ముందుకు తీసుకువెళతాయి.
 

Father mother son


4.ప్రతి తండ్రి తమ పిల్లల కోసమే కష్టపడతాడు. నిజమే కానీ... పిల్లలతో సమయం గడపడానికి కూడా వీలు లేకుండా కష్టపడకూడదు. మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉన్నా... పిల్లలతో కాసేపు అయినా గడపాలి. రోజూ కాసేపు పిల్లలకు కాసేపు సమయం కచ్చితంగా కేటాయించాలి.
 

5.ప్రతి తండ్రి తమ పిల్లలకు మంచి రోల్ మోడల్ లా ఉండాలి. తండ్రి చేసే ప్రతి పనిని పిల్లలు గమనిస్తూనే ఉంటారు. మీరు అబద్దాలు ఆడటం, తప్పులు చేయడం వారు చూస్తే.. వాళ్లు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే.. ముందుగా మీరు నిజాయితీగా ఉండాలి. అప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
 

6.తండ్రి.. పిల్లలకు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పడమే కాదు.... వారు చెప్పేది కూడా  వినాలి. తండ్రికి కచ్చితంగా లిజనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. పిల్లల మాటలపై జడ్జిమెంట్ చేయకుండా... వారికి  మంచి విషయాల్లో సపోర్టివ్ గా నిలవాలి.

7.పిల్లలకు అన్ని క్లాసుల్లో చేర్పించడంతో తండ్రి బాధ్యత తీరిపోదు. స్విమ్మింగ్ లో నేర్పించినప్పుడు... వారితో కలిసి మీరు కూడా చేయాలి. పక్కనే ఉండి నేర్పించడానికి  ప్రయత్నించాలి.

8.పిల్లలతో మంచి, నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి.  పిల్లలతో తండ్రి మంచి బాండింగ్  ఏర్పడేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తండ్రిదే. తండ్రి ఇలా ఉంటేనే.. పిల్లల తమ సంతోషాన్ని, కోపాన్ని అన్నీ మీతో పంచుకుంటారు.

click me!