మన శరీరాలు జంక్ ఫుడ్ ను ఎందుకు కోరుకుంటాయో తెలుసా?

First Published Dec 24, 2022, 3:01 PM IST

కొన్ని పోషకాల లోపం వల్ల కూడా కొన్ని రకాల ఆహారాలను మన బాడీ కోరుకుంటుంది. మెగ్నీషియం లోపం వల్ల చాక్లెట్లు, బీన్స్, కాయ ధాన్యాలు వంటి ఆహారాలను తినాలనిపిస్తుంది. 
 

ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ను తినేవారు ఎక్కువయ్యారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.  కానీ మనకు మాత్రం వీటినే తినాలనిపిస్తుంది. వీటిని తింటే హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటు, ఊబకాయం, అధిక రక్తపోటు తో పాటుగా ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ మనలో చాలా మందికి ఈ కోరికలను నియంత్రించడం రాదు. అసలు మనకు జంక్ ఫుడ్ ను తినాలని ఎందుకు అనిపిస్తోందనే దానిపై  ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఆహారం చుట్టూ నమ్మకాలు

మనలో చాలా మంది ఆరోగ్యకరమైన, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు రుచిగా ఉండవని నమ్ముతుంటారు. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను తినే వారు చాలా తక్కువయ్యారు. ఎందుకంటే వీటిని చిన్నప్పటి నుంచి సరిగ్గా తినరు. అందులోనూ ప్రతి 5 నుంచి 6 సంవత్సరాలకు ఆహారం విషయంలో అభిరుచులు మారుతుంటాయట. అందులోనూ కూరగాయలు, పండ్లు జంక్ ఫుడ్ అంత టేస్టీగా అనిపించవు. అందుకే చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలకు బదులుగా రుచిగా ఉండి, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. 
 

తగినంత నిద్ర లేకపోవడం

చాలా మంది నిద్రను బలహీనతకు సంకేతంగా చూస్తారు. మన శరీరానికి అవసరమయ్యే  కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. తక్కువగా నిద్రపోయే వారు ఆరోగ్యకరమైన  ఆహారాలనే ఇష్టపడతారని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ నిద్రపోయే వారు ఐస్ క్రీం, పిజ్జా వంటి ఫోటోలను చూసినప్పుడు వారిలో వాటిని తినాలనే కోరిక పుడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిద్ర లేమి మన శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ ను తినాలన్న కోరిక పెరగడానికి దారితీస్తుంది. 
 

junk food

ఒత్తిడి

ఒత్తిడితో ఉన్నప్పుడు మన శరీరం "కార్టిసాల్" అని పిలిచే ఒత్తిడి హార్మోన్ ను విడుదల చేస్తుంది. కొవ్వులు, చక్కెరలు ఈ ఒత్తిడిని తగ్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీంతో మన శరీరం అలాంటి ఆహారాలనే ఎక్కువగా కోరుకుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. చక్కెర మెదడులో కార్టిసాల్, ఒత్తిడి సంకేతాలను తగ్గిస్తుంది.
 

junk food

చాలా త్వరగా తినడం

చాలా మంది ఫుడ్ ను నమలడానికి బదులుగా అలాగే మింగేస్తుంటారు. కానీ ఫుడ్ ను మింగడానికి ముందు ప్రతి ఒక్కరూ ఆహారాన్ని 32 సార్లు నమలాలని వైద్యులు చెబుతున్నారు. నిజానికి 32 నమలడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది భోజనాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే గట్.. మెదడుకు మధ్య తప్పుడు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల మెదడుకు సంతృప్తి సంకేతాలు మిస్ అవుతాయి. దీంతో మీరు అతిగా తింటారు. 
 

హార్మోన్ల అసమతుల్యత

పీరియడ్స్ సమయంలో, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. అంటే మీ గట్, మెదడు మధ్య సమన్వయంలో పాల్గొనే లెప్టిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు జంక్ ఫుడ్ ను తినాలనే కోరికలను పెంచుతాయి. 
 

junk food habit in children

తగినంత నీరు, ప్రోటీన్ తీసుకోకపోవడం

చాలా సార్లు దాహం అయితే కూడా ఆకలి కోరికలను పుడతాయి. వీటిని మన మనస్సు ఆకలి సంకేతాలుగా తప్పుగా అర్థం చేసుకుంటుంది. మనం సరిపడా నీటిని తాగకపోతే లేదా మన భోజనంలో ప్రోటీన్లు లేకపోతే ఈ ఆకలి బాధలు ఎక్కువ అవుతాయి. దీంతో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ ను తినేలా చేస్తాయి. 
 

పోషక లోపాలు

అంతర్లీన పోషక లోపం వల్ల కూడా నిర్దిష్ట ఆహారాల కోసం కోరికలు పెరుగుతాయి. మెగ్నీషియం లోపం వల్ల చాక్లెట్లు, కాయలు లేదా బీన్స్ తినాలనిపిస్తుంది. క్రోమియం లేదా భాస్వరం లోపం వల్ల చక్కెర కోరికలు పెరుగుతాయి.  సోడియం లోపం వల్ల చిప్స్ వంటి ఉప్పుగా ఉండే ఆహారాలను తినాలనిపిస్తుంది. 

click me!