అక్షయ తృతీయ సందర్బంగా రిలయన్స్‌ జ్యువెల్స్‌ కొత్త కలెక్షన్స్.. ఆవిష్కరించిన బాలీవుడ్‌ నటి..

By Ashok kumar Sandra  |  First Published Apr 23, 2024, 8:20 PM IST

'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' కలెక్షన్‌ సిరీస్‌లో తొమ్మిదోదైన వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్‌ ఐకాన్‌, బాలివుడ్‌ దివా దిశా పటానీ ప్రత్యేక ఫెస్టివల్‌ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.


ముంబ్రై ఏప్రిల్  23, 22024: భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యేకమైన, అద్భుతమైన కలెక్షన్లతో పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' కలెక్షన్‌ సిరీస్‌లో తొమ్మిదోదైన వింధ్య మధ్యప్రదేశ్‌లోని గొప్ప కళా సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందింది. వారణాసిలోని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్యాషన్‌ ఐకాన్‌, బాలివుడ్‌ దివా దిశా పటానీ ప్రత్యేక ఫెస్టివల్‌ కలెక్షన్‌ను ఆవిష్కరించారు.

హిందూ సంస్కృతిలో శ్రేయస్సు, సమృద్ధిని సూచించే పవిత్ర పండుగ అక్షయ తృతీయ, ఆభరణాలు కొనడానికి సరైన సందర్భంగా ఇది పరిగణించబడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జ్యువెల్స్‌ వింధ్య కలెక్షన్‌... మధ్యప్రదేశ్‌ గొప్ప సాంస్కృతిక వారసత్వం, నిర్మాణ వైభవానికి నివాళి అర్పించే విధంగా అద్భుతమైన ఆభరణాల శ్రేణిని అందిస్తోంది. గ్వాలియర్‌ కోట, సాంచి స్థూపం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ ఆలయం, మితాలి, బటేశ్వర్‌ దేవాలయాలు వంటి మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ కట్టడాల స్ఫూర్తితో ప్రతి నగలను డిజైన్‌ చేశారు.

Latest Videos

 

రిలయన్స్‌ జ్యువెల్స్‌ సీఈవో సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ, "ఈ అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్ను ప్రారంభించడం... భారతదేశంలో వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పండుగలా జరుపుకోవాలనే మా నిబద్ధతకు నిదర్శనం. మధ్యప్రదేశ్‌ యొక్క గొప్ప సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఈ సేకరణ మా 'జ్యువెల్స్‌ ఆఫ్‌ ఇండియా' సిరీస్‌లో తొమ్మిదవది, భారతీయ కళ, హస్తకళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తుంది” అని అన్నారు.

అలాగే "ఆభరణాలను కొనడానికి  అక్షయ తృతీయ అనువైన సందర్భం, ఎందుకంటే ఇది సంపద, శ్రేయస్సుకు ప్రతీక, అలాగే ఈ సంవత్సరం మేము  మా కస్టమర్లకు వింధ్య కలెక్షన్స్  ద్వారా వారి ఇంటికి శ్రేయస్సును తీసుకుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నాము! ఈ అద్భుతమైన కలెక్షన్స్ కేవలం శ్రేయస్సు, సొగసుకు మాత్రమే ప్రతిక కాదు, అక్షయ తృతీయ మా బ్రాండ్‌ రిలయన్స్‌ జ్యువెల్స్‌ యొక్క శాశ్వత వేడుక స్ఫూర్తికి కూడా ప్రతీక” అని అన్నారు.

రిలయన్స్‌ జ్యువెల్స్‌ వారణాసి స్టోర్‌లో ఈ కలెక్షన్ను ఆవిష్కరించిన సందర్భంగా నటి దిశా పటానీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "ఈ కలెక్షన్స్ లోని ప్రతి జ్యువెలరీ మధ్యప్రదేశ్‌ గొప్ప సాంస్కృతిక వారసత్వం, నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబించే కళాఖండం. ఉజ్జయినిలోని వివిధ దేవాలయాల్లోని అంశాలను అందంగా మేళవించిన డైమండ్‌ నెక్లెస్‌ డిజైన్‌ నాకు వ్యక్తిగతంగా నచ్చింది. ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, ఇవి సాంప్రదాయం, సౌందర్యానికి నిజమైన చిహ్నాలు, ఇది ప్రతి వార్డ్‌ రోబ్‌లో తప్పనిసరిగా ఉండాలి.” అని అన్నారు.

కచ్చితత్వంతో రూపొందించిన వింధ్య కలెక్షన్స్ లో చక్కగా రూపొందించిన చోకర్ల నుండి బంగారం, డైమండ్‌ వేరియంట్లలో లభించే క్లిష్టంగా రూపొందించిన గాజుల వరకు వివిధ రకాల ఆభరణాలు అందుబాటులో ఉంటాయి. వింధ్య కలెక్షన్‌ అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, ఇది సంప్రదాయం, సొగసు, కాలాతీత సౌందర్యపు వేడుక. పండుగ సందర్భానికి సాంప్రదాయ చీరను అలంకరించడానికి లేదా వస్త్రధారణకు గ్లామర్‌  జోడించడానికి అనువుగా ఉంటుంది, అలాగే మీ ప్రతిరోజు  దుస్తులకు తోడుగా ప్రతి నగలు సొగసు, అధునాతనతను ప్రదర్శిస్తుంది, అక్షయ తృతీయను గొప్ప స్టయిల్లో జరుపుకోవడానికి అనువైనది ఈ కలెక్షన్‌.

రిలయన్స్‌ జ్యువెల్స్‌ అత్యద్భుతమైన సిరీస్‌ జ్యవెల్స్  ఆఫ్ ఇండియాలో తాజా చేరిక ఈ వింధ్య కలెక్షన్స్. భారతదేశంలోని విభిన్న ప్రాంతాలు, సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌, హస్తకళలను ఇది హైలైట్‌ చేస్తుంది. వింధ్య మధ్యప్రదేశ్‌ కళాత్మక చతురత, కాలాతీత సొగసు నుండి ప్రేరణ పొందగా, ఈ సిరీస్‌లోని గత ఎనిమిది కలెక్షన్లు  భారతదేశ సౌందర్యానికి నిదర్శనంగా ఉన్నాయి:

*స్వర్ల్‌ బంగా సేకరణ బెంగాల్‌ కవితా సౌందర్యం, సాంస్కృతిక వారసత్వానికి నివాళి

* తంజావూరు సేకరణ చోళ సామ్రాజ్య రాజధాని అయిన తంజావూరు చారిత్రక సంపదకు ప్రేరణ.

* మహాలయ సేకరణ మహారాష్ట్ర వైభవానికి ప్రతిబింబం.

* రన్‌కార్‌ సేకరణ రాన్‌ ఆఫ్‌ కచ్‌ అద్భుతమైన అందాలను సంగ్రహిస్తుంది

* కాస్యం సేకరణ బనారన్‌ వైభవంతో మెరిసిపోతుంది.

* ఉత్కలా సేకరణ తీరప్రాంత ఒడిషా వైభవాన్ని ప్రేరేపిస్తుంది, అతుల్య సేకరణ రాజస్థాన్‌ రాజ వారసత్వం, మొఘల్‌ కాలం నాటి వైభవాన్ని ప్రదర్శిస్తుంది

 * అపూర్వం సేకరణ హంపి నిర్మాణ వైభవాన్ని చిత్రిస్తుంది.

వింధ్య కలెక్షన్‌ ఇప్పుడు అన్ని రిలయన్స్‌ జ్యువెల్స్‌ స్టోర్లలో లభిస్తుంది. ఈ అక్షయ తృతీయ సీజన్ల కస్టమర్లు ఈ ఆకర్షణీయమైన నగలతో తమను తాము అన్వేషించవచ్చు, అలంకరించుకోవచ్చు, ఇది శ్రేయస్సు, సమృద్ధికి నాంది పలుకుతుంది.

వింధ్య కలెక్షన్స్‌ గురించి:

రిలయన్స్‌ జ్యువెల్స్‌ వారి వింధ్య కలెక్షన్‌ అన్నది మధ్యప్రదేశ్‌  గొప్ప  సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన హస్తకళా నైపుణ్యం నుండి ప్రేరణ పొందిన ఇంకా  వారసత్వం, ఆధునికతల ఆకర్షణీయమైన కలయిక. ఐకానిక్‌ ల్యాండ్‌ మార్క్‌లు, పౌరాణిక కథల నుండి ప్రేరణ పొందిన భాగాలతో, ప్రతి నగలు ఈ ప్రాంతపు కాలాతీత సొగసు, బిన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. చక్కగా రూపొందించిన చోకర్ల నుండి సంక్లిష్టంగా డిజైన్‌ చేయబడిన చెవిపోగులు, గాజుల వరకు వింధ్య కలెక్షన్‌ అద్భుతమైన రేంజ్లో  బంగారు, వజ్రాభరణాలను అందిస్తుంది, దానిని ధరించినవారి జీవితాల్లో శ్రేయస్సు, వేడుకను ఆహ్వానిస్తుంది.

రిలయన్స్‌ జ్యువెల్స్‌ గురించి:

రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్లో భాగమైన రిలయన్స్‌ జ్యువెల్స్‌ 200పైగా నగరాల్లో షోరూమ్‌లు, షాప్‌-ఇన్‌ షాపుల్లో 400 పైగా  స్టోర్లను నిర్వహిస్తుంది. రిలయన్స్‌ జ్యువెల్స్‌ అద్భుతమైన రేంజ్ లో  బంగారం, వజ్రం, వెండి ఆభరణాల కలెక్షన్లను
అందిస్తుంది. డిజైన్‌, హస్తకళలపై దృష్టి సారించి బ్రాండ్‌  కస్టమర్లకు  కళ, కాఫ్ట్‌, గొప్ప భారతీయ వారసత్వం నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైనర్‌ కలెక్షన్స్  అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం కోసం సందర్శించండి : http://www.reliancejewels.com

facebook : https://www.facebook.com/RelianceJewels/

instagram: https://www.instagram.com/reliancejewels/

 youtube: ఇక్కడ సందర్శించి సబ్‌స్కైబ్‌ చేసుకోండి - https://www.youtube.com/channel/UChHK7RxxqsHyPekDIlHg1zw

మరింత సమాచారం కోసం:  సంప్రదించండి

నమ్రతా షా

Namrata.shah@ril.com 

click me!