T20 World Cup 2024 యాక్ష‌న్ కు మీరు సిద్ద‌మా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్

Published : Apr 23, 2024, 09:11 PM IST
T20 World Cup 2024 యాక్ష‌న్ కు మీరు సిద్ద‌మా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్

సారాంశం

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో భార‌త జ‌ట్టు గ్రూప్-ఏ లో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లతో త‌ల‌ప‌డ‌నున్నభార‌త్.. తొలి మ్యాచ్ ను జూన్ 5న న్యూయార్క్ లో ఐర్లాండ్ తో ఆడ‌నుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియాకు సంబంధించిన సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.   

T20 World Cup 2024 - Team India : ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఐపీఎల్ 2024 మ‌ధ్య టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపుతూ ఐపీఎల్ 17వ సీజ‌న్ సగం పూర్త‌యింది. చివ‌రి బంతి వ‌ర‌కు సాగిన చాలా థ్రిల్లింగ్ విక్ట‌రీలు క్రికెట్ ల‌వ‌ర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే మ‌స్తు మ‌జాను అందించాయి. దీంతో రాబోయే మేగా క్రికెట్ టోర్నీ టీT20 ప్రపంచ కప్ 2024 పై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. ఈ సారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అమెరికా, వెస్టీండీస్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

గ్రూప్ ఏ లో భార‌త్ తో పాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెన‌డా, యూఎస్ఏలు ఉన్నాయి. భార‌త త‌న తొలి మ్యాచ్ ను   జూన్ 5న ఐర్లాండ్‌తో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 పోరును ప్రారంభించ‌నుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన నాయకత్వంలోని టీమిండియాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌ చేస్తారన్న వార్తలు ఉత్కంఠను మరింతగా పెంచాయి. తాజాగా బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ భార‌త జ‌ట్టుకు సంబంధించిన సాంగ్ ప్రోమోను విడుద‌ల చేసింది.

చరిత్ర సృష్టించిన యుజ్వేంద్ర చహల్.. ఐపీఎల్ లో 200 వికెట్లు.. !

రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా  టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంద‌నీ, ఈ యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా? అంటూ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాలతో కూడిన‌ వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం ‘వందేమాత‌రం’ను ప్లే చేయ‌డం.. చివ‌ర‌లో విరాట్ కోహ్లీ సెల్యూట్ చేయ‌డం వంటి క్ష‌ణాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

 

 

RR VS MI: యశస్వి జైస్వాల్ సెంచరీ.. సందీప్ పంజా.. ముంబైని చిత్తుచేసిన రాజస్థాన్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..