జగన్ -చంద్రబాబు- పవన్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు, ఎవరి ఆస్తి ఎంత....?

First Published | Apr 23, 2024, 9:46 PM IST

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.  ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో ఆస్తులు, అప్పులు చూపించాల్సి ఉంది. ఇక ఏపీలో పార్టీల అధిపతులైన చంద్రబాబు, జగన్, పవర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? 
 

దేశ మతా ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. ఇటు ఆంధ్రప్రేదేశ్ లో కూడా ఎన్నికల వేడి గట్టిగా రాజుకుంది. నాయకుల ప్రచారాలతో ఆంధ్రా హోరెత్తిపోతోంది. ఈక్రమంలో నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుండగా.. పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్, జగన్ ల నామినేషన్లు... అందులో వారు చూపిన ఆస్తులు హాట్ టాపిక్ గా మారాయి. 
 

చంద్రబాబు నాయుడు,జగన్, పవన్ నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవీట్ లో పొందుపరిచిన తమ సొంత ఆస్తులు.. తమ కుటుంబ సభ్యులు పేరుమీ ఉన్న ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.  మరిఆస్తులలో ఎవరు ముందు ఉన్నారు.. చంద్రబాబుఆస్తి పెరిగిందా.. జగన్ ఆస్తి పెరిగింది. వీరితో పాటు పవర్ స్టార్ ఆస్తులు ఎన్ని.  గతంలో కంటే పవన్ కళ్యాణ్ ఆస్తి పెరిగిందా.. లేదా..? చూడ్డాం. 
 

పవన్ కు పిచ్చిపట్టింది... వైజాగ్ హస్పిటల్ లోచేర్చాలి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Latest Videos


రీసెంట్ గా కుప్పంలో నామినేషన్ వేశారు తెలుగు దేశం అధినేత ..ప్రతిపక్ష నాయకుడు..  చంద్రబాబు నాయుడు.  చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ లకు ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి చంద్రబాబు, నారా లోకేష్ లు అందించారు. అయితే ఈ సమాచారం ప్రకారం  చంద్రబాబు ఆస్తులు జగన్ కంటే ఎక్కువ ఉన్నట్టు సమాచారం. 

chandra babu naidu

చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల పేరు మీద 931 కోట్ల ఆస్తులు ఉండగా.. నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్ల వరకూ ఉంది. ఇక చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ టోటల్ గా  1473 కోట్లుగా ఉంది. గత ఎన్నికల సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల సమయానికి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ 39 శాతం పెరిగాయి.
 

jegan mohan warning to sand mafias

ఇక ఆంధ్ర ప్రదేశ్ సీఎం.. వైఎస్ జగన్ తో పాటు... అతని కటుంబ ఆస్తుల వివరాలకు వస్తే.. వారికి  779.8 కోట్లు  ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ లిస్ట్  లో ఇందులో జగన్ పేరుతో ఉన్న ఆస్తులు 529. 87 కోట్లు కాగా, ఆయన సతీమణి భారతి పేరు మీద ఉన్న ఆస్తుల ఆస్తులు  176. 30కోట్లు.. ఇక సీఎం అయిన తరువాత ఈ  ఐదేళ్ళలో జగన్ ఆస్తుల విలువ కూడా 41 శాతం పెరిగింది. 

Pawan Kalyan

ఇక జనసేన అధినేత.. పవర్ స్టార పవన్ కళ్యాణ్ కూడా భారీ ఎత్తులన ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేశారు. ఇక ఆయన ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో వెల్లడించినట్లుగా చూస్తే.. . జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆస్తులు చూస్తే.. పవన్ కళ్యాణ్ కు.. ఆయన కుటుంబానికి కలిపి 163 కోట్ల వరకూ ఉన్నాయని తెలుస్తోంది.  గత 5 సంవత్సరాల్లో  పవర్ స్టార్ ఆస్తి 191 శాతం పెరుగింది. ఇక 2019 సంవత్సరంలో ఆయన ఆస్తుల విలువ 56 కోట్ల రూపాయలు ఉండగా.. తాజాగా తన భార్య, పిల్లలు పేర్లపై ఉన్న ఆస్తులను 163 కోట్ల రూపాయలుగా వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు, లోకేష్, వైయస్ జగన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను ఒకసారి చూసినట్లయితే, ఎన్నికల సంఘానికి వీరు దాఖలు చేసిన అఫిడవిట్లను బట్టి జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు ఫ్యామిలీకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ తాను, తన సతీమణి భారతి, తన ఇద్దరు కుమార్తెలకు సంబంధించిన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చారు.

click me!