CSK vs LSG : ఐపీఎల్ 2024 39వ మ్యాచ్ లో సెంచరీల మోత మోగింది. చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ లు సెంచరీలు బాదారు. ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ విక్టరీని అందుకుంది.
CSK vs LSG : మార్కస్ స్టోయినిస్ మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ లో తన తొలి సెంచరీ కొట్టడంతో పాటు తన అద్భుతమైన ఆటతో తన జట్టుకు సూపర్ విక్టరీని అందించాడు. మార్కస్ స్టోయినిస్ గ్రేట్ షో ముందు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ వృథాగా మారింది. మార్కస్ స్టోయినిస్ సెంచరీ, నికోలస్ పూరన్ మెరుపులు, దీపక్ హుడా ధనాధన్ ఇన్నింగ్స్ తో లక్నో మరో 3 బంతులు మిగిలి ఉండగానే భారీ టార్గెట్ ను ఛేధించింది. బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న స్టోయినిస్ బ్యాటింగ్ లో చెన్నై బౌలింగ్ ను ఉతికిపారేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 23) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. చెన్నై టీమ్ కు గొప్ప ఆరంభం లభించలేదు. అజింక్యా రహానె 1 పరుగు, డారిల్ మిచెల్ 11, రవీంద్ర జడేజా 16 పరుగులతో నిరాశపరిచారు. కానీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్ తో లక్నో బౌలింగ్ ను ఉతికిపారేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో రెండో సెంచరీని కొట్టాడు. 60 బంతుల్లో 108 పరుగుల తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
T20 World Cup 2024 యాక్షన్ కు మీరు సిద్దమా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్
మరో ఎండ్ లో శివమ్ దూబే శివాలెత్తాడు. సిక్సర్ల మోత మోగించాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ చెపాక్ స్టేడియంను షేక్ చేశాడు. 27 బంతుల్లో 66 పరుగుల తన ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. లక్నో టీమ్ ముందు 211 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో టీమ్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. క్వింటన్ డీకాక్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. మ్యాచ్ లో చెన్నై వైపు ఉన్న సమయంలో లక్నో ప్లేయర్లు అద్భుతమైన ఆటతో మ్యాచ్ ను తమపైపునకు లాగేసుకున్నారు. మార్కస్ స్టోయినిస్ దుమ్మురేపే బ్యాటింగ్ తో తొలి సెంచరీని కొట్టాడు. 63 బంతుల్లో 124 పరుగులు బాదాడు. తన ఇన్నింగ్స్ తో 13 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. అలాగే, నికోలస్ పూరన్, దీపక్ హుడా సూపర్ ఇన్నింగ్ లతో లక్నో టీమ్ విజయాన్ని అందుకుంది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 213-4 పరుగులతో చెన్నైని చిత్తుచేసింది.
CSK VS LSG : సిక్సర్ల మోత.. సెంచరీతో చెలరేగిన రుతురాజ్.. శివాలెత్తిన శివమ్ దూబే..