ఉప్పు, నూనె, సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించడం
ఉప్పును ఎక్కువగా తింటే బాడీ డీహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంది. పూరి, దాల్ బాటీ లేదా నూనె, మసాలాలు ఎక్కువగా ఉపయోగించిన ఆహారాలను తింటే కూడా తరచుగా దాహం అవుతుంటుంది. దీనివల్ల గొంతు పొడిబారుతుంది. మసాలా దినుసులు, నూనె ఎక్కువగా ఉండే ఆహారాల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.