MS Dhoni - Love Breakup : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అభిమానులను ఆకర్షిస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఎంఎస్ ధోని ప్రస్తుతం కెప్టెన్సీ లేకుండా చెన్నై టీమ్ కు ప్లేయర్ గా ఐపీఎల్ 2024 లో ఆడుతున్నాడు.
MS Dhoni Fan : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ అయినప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( ఐపీఎల్ 2024 )లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మ్యాచ్‌ల సమయంలో ధోనిపై అభిమానులు చూపించే అపరిమితమైన ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'తలా' వస్తున్నాడంటే చాలు స్టేడియం మొత్తం హోరెత్తుతుంది.
ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అనేక ఘటనలు రుజువు చేశాయి. మరోసారి అభిమానులలో ధోనికి ఉన్న క్రేజ్‌ను ప్రతిబింబిస్తూ, ఆదివారం జరిగిన చెన్నై vs హైదరాబాద్ మ్యాచ్‌లో ఒక ప్లకార్డు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ధోని అభిమానికి లవ్ బ్రేకప్ కు సంబంధించినది. అభిమాని లవ్ బ్రేకప్ కు ధోని కారణం కావడంతో వైరల్ గా మారింది. విచిత్రంగా ఉన్న తన అభిమాని ఇదే చెప్పాడు.
చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేంద్ర సింగ్ ధోనీపై ఉన్న పిచ్చిలో, ఈ అభిమాని చేసిన పని మీకు దిమ్మతిరిగేలా చేస్తుంది. ఈ ధోనీ అభిమాని తన పోస్టర్‌లో 'నా గర్ల్‌ఫ్రెండ్ పేరులో 7 అక్షరాలు లేకపోవడంతో ఆమెతో విడిపోయాను' అని రాశాడు. ఈ అభిమాని మహేంద్ర సింగ్ ధోని వైపు చూపిస్తూ కనిపించాడు. ధోనీకి 7వ నంబర్ జెర్సీ ధరిస్తాడని తెలిసిందే. అలాగే, ఈ నబర్ తో తో లోతైన అనుబంధం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయిన తర్వాత ధోనీ తన బ్యాటింగ్ కోసం మైదానంలోకి ప్రవేశించాడు. ధోని రాగానే కెమెరా ప్లకార్డు పట్టుకున్న అభిమాని వైపు ఫోకస్ చేశారు.
Fans at the Chepauk. 😄👌 pic.twitter.com/Qmk3pq4b0V
— Mufaddal Vohra (@mufaddal_vohra)