లైంగిక ఆనందం, ఉద్వేగానికి చేరుకోవడానికి ముందుగా దీని గురించి భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. మీ భాగస్వామితో లైంగిక కార్యకలాపాల గురించి మాట్లాడలేకపోతే.. మీరు ఇంత వరకు సరైన భావప్రాప్తిని పొందే అవకాశమే లేదు. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్, ప్లెజర్ పాయింట్ గురించి మీ భాగస్వామితో పంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్త్రీ ఉద్వేగ పాయింట్ భిన్నంగా ఉంటుంది. కొంతమంది చనుమొన లేదా జి స్పాట్ నుంచి ఉద్వేగాన్ని చేరుకోరుకుంటారు.
స్త్రీలు ఉద్వేగం విషయంలో కాస్త ఆలోచించాలి. మీ భాగస్వామి నుంచి భావప్రాప్తిని కోరుతున్నట్టైతే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం మంచిది. ఎందుకంటే భావప్రాప్తి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో ఏమేమీ మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గోర్లు కత్తిరించడం
సాధారణంగా ఫోర్ ప్లే లో భాగంగా వేలును ఉపయోగిస్తారు. ఇది గర్భధారణ సమయంలో మహిళలకు నొప్పిని కలిగించదు. అలాగే వారు భావప్రాప్తిని చేరుకోవడానికి సహాయపడుతుంది. కానీ వేళ్లకు గోర్లును అసలే ఉంచకూడదు. ఎందుకంటే ఇది యోనిలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మన గోళ్లు, అరచేతులపై వేల సంఖ్యలో క్రిములు, బ్యాక్టీరియాలు ఉంటాయి. యోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. గోర్లు పెద్దగా ఉంటే చర్మం తెగే అవకాశం ఉంది. అంతేకాదు యోని చర్మంపై గీతలు పడే అవకాశం ఉంది. ఇది మీ ఉద్వేగానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే గోర్లను పెంచకండి.
ఓరల్ సెక్స్ గురించి మాట్లాడండి
ఆడవారికి కాస్త సిగ్గు ఎక్కువే. అందేకే చాలా మంది స్త్రీలు తమలో ఉన్న విషయాల గురించి భాగస్వామికి కూడా చెప్పరు. ఒకవేళ మీకు ఓరల్ సెక్స్ మీకు మంచి భావప్రాప్తిని ఇస్తుందనుకున్నా.. దానిని ఆస్వాదించాలనుకున్నా మీ భాగస్వామికి చెప్పేయండి. అలాగే పరిశుభ్రతను కూడా పాటించాలి. దీనికి ముందు మీ యోనిని శుభ్రపరచడం మర్చిపోవద్దు.
కండోమ్లు, కందెనలు
మీ భాగస్వామి కండోమ్ లేకుండా సెక్స్ చేయడానికి ఇష్టపడితే మీరు మీ భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇది గర్భందాల్చేందుకు, ఎస్టీఐ లను కలిగించేందుకు దారితీస్తుంది. అంతేకాదు గర్భనిరోధక మాత్రలు వాడటం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మీ సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. అందుకే కండోమ్ లేకుండా మీ భాగస్వామిని శృంగారంలో పాల్గొననివ్వకండి. అలాగే గర్భధారణ సమయంలో మీకు నొప్పిగా అనిపించినా లేదా మీరు సెక్స్ ను అంతగా ఆస్వాదించలేకపోయినా మీ భాగస్వామిని ఆపండి.
ఓరల్ సెక్స్ లో పాల్గొనాలపించకపోతే ఓపెన్ గా మాట్లాడండి
బలవంతంగా సెక్స్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ భాగస్వామికి ఓరల్ సెక్స్ లో పాల్గొనాలని ఉండి, మీకు లేకపోతే వెంటనే దాని గురించి ఓపెన్ అవ్వండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకున్న సమస్యను మీ భాగస్వామితో చర్చించండి. అలాగే సౌకర్యవంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు పరిశుభ్రతతో సమస్య ఉంటే లేదా అక్కడ నుంచి వాసన వచ్చినా ఓరల్ సెక్స్ కు ముందు.. మీ భాగస్వామిని వారి ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయమని అడగండి. ఓరల్ సెక్స్ లో ఇది చాలా ముఖ్యం.
స్థానం గురించి మాట్లాడటం ముఖ్యం
మంచి పొజీషన్ లో సెక్స్ ను ఆస్వాదించాలనుకుంటారు. అయితే సిగ్గు, బిడియం కారణంగా మహిళలు తరచుగా వారి భాగస్వామికి అనుగుణంగా సెక్స్ లో పాల్గొంటారు. అయితే సెక్స్ సమయంలో ఇద్దరికీ ఇష్టమైన పొజీషన్స్ ను ట్రై చేయొచ్చు. అందుకే ఆడవారు నిర్మోహమాటంగా దీని గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. ముందుగా మీరు ఏ యాంగిల్ లో, ఏ పొజిషన్ లో ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నారో అర్థం చేసుకోండి. అప్పుడు మీ భాగస్వామితో తదనుగుణంగా ఈ విషయం గురించి మాట్లాడండి. సెక్స్ సమయంలో కోణాన్ని, స్థానాన్ని మార్చమని వారిని అడగండి.