పశ్చిమ కనుమల్లో డ్యాన్సర్ కప్ప..!

First Published Nov 24, 2020, 11:25 AM IST

ఈ డ్యాన్స్ కప్ప  కూడా మైక్రోక్సాలిడే కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. దీని గొప్ప లక్షణం ఏమిటంటే.. ఇవి ఆకర్షించడానికి ప్రత్యేకమైన శబ్దాలను చేయదట.
 

పశ్చిమ కనుమలు భారత ద్వీపకల్ప పశ్చిమ తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. కాగా.. తాజాగా.. పశ్చిమ కనుమల్లో కొత్త రకం కప్పలు వెలుగుచూశాయి. రెండు సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రాంతంలో కొత్త రకం కప్పలు బయటపడ్డాయి. అవి చూడటానికి చిట్టి కప్పలు లాగా ఉంటాయి.
undefined
కాగా.. తాజాగా.. మరో కొత్త రకం కప్పను పరిశోధకులు కనుగొన్నారు. అవతరించుకుపోయిన ది ఫ్రాగ్ మ్యాన్ ని సత్యభామ దాస్ బిజు కనుగొన్నారు. కాగా.. తాజాగా డ్యాన్సర్ కప్ప ని కనుగొన్నారు.
undefined
ఈ డ్యాన్స్ కప్ప కూడా మైక్రోక్సాలిడే కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. దీని గొప్ప లక్షణం ఏమిటంటే.. ఇవి ఆకర్షించడానికి ప్రత్యేకమైన శబ్దాలను చేయదట.ఈ డ్యాన్సర్ ఫ్రాగ్ ని కూడా పశ్చిమ కనుమల్లో కనుగొన్నారు.
undefined
ఉదర భాగం నారింజ రంగులో.. ముందు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి.. అక్కడక్కడా నక్షత్రాన్ని తలపించే మచ్చలు ఉన్న వింత ప్రాచీన కప్పను శాస్త్రవేత్తలు గుర్తించారు. బొటనవేలంత పరిమాణంలో ఉన్న ఈ మరుగుజ్జు కప్పను కేరళలోని పశ్చిమ కనుమల్లో కనిపించింది. లక్షల సంవత్సరాల నాటి ఉభయచరాల వారసత్వానికి ఇవి ఏకైక ఆనవాలని పరిశోధకులు చెప్పారు.
undefined
వేరే కప్పలను ఆకర్షించేందుకు సాధారణ కప్పలు రకరకాల శబ్దాలు చేస్తాయి. కానీ.. ఈ డ్యాన్సర్ కప్ప మాత్రం ఎలాంటి శబ్దాలు చేయదు.ఇవి ఎక్కువగా నీటిలో ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇవి శబ్దాలు చేసినా.. మగ కప్పకు నీటిలో ఉండటం వల్ల ఆడ కప్ప చేసిన శబ్దం వినపడదు.
undefined
అయితే.. ఇవి వాటి డ్యాన్స్ ద్వారానే ఆకర్షిస్తాయట. వాటి కాళ్లను ఒకరకమైన ఫోజులో పెట్టి ఆకర్షిస్తాయని పరిశోధకులు చెబుతన్నారు,
undefined
ఇవి కాళ్లు కదిలించే విధానం.. అచ్చంగా డ్యాన్స్ చేసినట్లుగానే ఉంటుందని వారు చెబుతున్నారు. అలా అవి డ్యాన్స్ చేయడం చూడగానే.. ఆపోజిట్ జెండర్ ఫ్రాగ్స్ వాటికి ఆకర్షితులైపోతాయి.
undefined
కాగా.. ఈ కప్ప గోరుపై పట్టేంత చిన్నవి. ఇన్నాళ్లూ ఎవరికీ కనపడకుండా దాక్కున్నాయి. ఇవన్నీ ఈమధ్యే మనదేశంలో పశ్చిమ కనుమల దగ్గర దొరికిన ఏడు కొత్త జాతి కప్పల సంగతులు. నైట్‌ ఫ్రాగ్స్‌గా పిలిచే ఈ ఏడు కప్పజాతుల్లో నాలుగు ప్రపంచంలోనే అతి బుల్లివట.
undefined
వాటి పరిమాణం ఎంతో తెలుసా? అర అంగుళం కన్నా తక్కువే. అంటే అర్ధరూపాయి బిళ్లపై సగం ఉంటాయంతే. మిగతా కప్పలు అర అంగుళం నుంచి ఒకటిన్నర అంగుళమంత పరిమాణంలో ఉన్నాయి.
undefined
నిక్టిబట్రాచస్‌ జాతికి చెందిన ఈ కప్పలకు నిక్టిబట్రాచస్‌ మనలరి, పులివిజయని, రాబిన్‌మోరై, శబరిమలై, వెబిల్ల, అతిరప్పిలైన్సిస్‌, రాడ్‌క్లిఫీ అని పేర్లు పెట్టారు. వీటి అతి సూక్ష్మ రూపం, ఇవి చేసే ప్రత్యేకమైన కీటకాల్లాంటి ధ్వనుల వల్ల ఇప్పటి వరకు వీటిని కనిపెట్టడం కష్టమయింది.
undefined
శాస్త్రవేత్తలు అయిదు సంవత్సరాల పాటు పరిశోధన చేస్తే ఈమధ్యే దొరికాయి. బాగా పరీక్షిస్తే ఇవన్నీ కొత్త కప్ప జాతులే అని తేలింది. అయితే ఈ అరుదైన కప్పల్లో పాపం... కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ కొత్త కప్పలతో కలిపి నైట్‌ ఫ్రాగ్స్‌ కప్పల జాతుల సంఖ్య 35కి చేరింది.
undefined
click me!