నార్మల్ గానే పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అది కూడా నెయ్యితో చేస్తే.. ఇంకా మంచిదట. బాడీకి మంచి రిలక్సేషన్ దొరుకుతుందట. పాదాల నుంచి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. దాని వల్ల నీరసం అనేది ఉండదు. ఉత్సాహం పెరుగుతుంది.
పాదాలు రెగ్యులర్ గా చాలా మందికి పగులుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా పగులుతూ ఉంటాయి. అలాంటివారు నెయ్యి ఒక స్పూన్ పాదాలకు రాయడం వల్ల ఆ పగుళ్లు తగ్గుతాయి. పాదాలు చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి. మృదువుగా మారతాయి.