మోస్ట్ సక్సెస్ఫుల్ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 ఇటీవల మొదలైంది. పలువురు సెలెబ్స్ గెస్ట్స్ గా వచ్చారు. వారిలో అల్లు అర్జున్ చాలా ప్రత్యేకం. ఇటీవల అల్లు అర్జున్ ఎపిసోడ్ ప్రసారమైంది. విశేష ఆదరణ దక్కించుకుంది. పలు కీలక విషయాలు ఈ టాక్ షోలో చర్చకు వచ్చాయి.
మెగా హీరోలతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్డ్ వార్ జరుగుతుందన్న వాదన ఉంది. జనసేన కీలక నేతలు బహిరంగంగానే అల్లు అర్జున్ పై విమర్శల దాడికి దిగారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ అభిప్రాయం ఏమిటనే ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ కామెంట్ ఏమిటని బాలయ్య అడగ్గా.. అల్లు అర్జున్ పాజిటివ్ గా స్పందించారు.